Home » Pavan kalyan : ఆ నటునికి ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్

Pavan kalyan : ఆ నటునికి ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్

Pavan kalyan : మెగా స్టార్ చిరంజీవి తో పాటు అతని సోదరులు నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో వారికి వారే సాటి. సహాయ, సహకారాలు అందించడంలో ఆ ముగ్గురు ఎప్పుడూ ముందే ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా చిరంజీవి నటీ, నటులకు ఆర్థిక సహాయం తో పాటు వైద్య పరంగా కూడా సహాయం అందించారు.

ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆర్థికంగా ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటారు. సినీ పరిశ్రమలో ఈ ముగ్గురు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటారు అనేది చిత్ర పరిశ్రమలో తెలిసినదే.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హాస్య నటుడికి ఆర్థికంగా సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ హాస్య నటుడు ఫిష్ వెంకటేష్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దింతో వెంకటేష్ సినిమా షూటింగ్ లను సైతం చేయడం లేదు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకటేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన భాదలు చెప్పొకోవడంతో స్పందించారు. వెంటనే రెండు లక్షల రూపాయలు అందజేసి పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకటేష్ ను ఆదుకున్నారు. 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *