Ismart Shanker : సినీ పరిశ్రమ అంచనాలను తలకిందులు చేస్తూ 2019 లో విడుదల అయిన ఇస్మార్ట్ శంకర్ పెద్ద విజయాన్ని సాధించింది. 75 కోట్ల రూపాయల వసూళ్లను పెట్టుబడిదారులకు తెచ్చిపెట్టింది. కొన్నేళ్ల తరువాత పూరి జగన్నాథ్ ఆ సినిమా విజయంతో ప్రశాంతంగా నిద్రపోయారు. ఇస్మార్ట్ శంకర్ పెట్టుబడిదారుడు కూడా పూరి జగన్నాథ్ కావడం విశేషం. ఆ సినిమా విడుదల అయ్యేనాటికి పూరీ జగన్నాథ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో జగన్నాథ్ కష్టాలన్నీ తొలగిపోయాయి. ఆ సినిమా సక్సెస్ తో అప్పుడే డబల్ ఇస్మార్ట్ కూడా వస్తుందంటూ అభిమానులను ఊరించారు. మొదటి భాగానికి ఇది కొనసాగిపుంగ వచ్చింది. ఆ సినిమా హీరో రామ్ పుట్టినరోజు ను పురస్కరించుకొని డబల్ ఇస్మార్ట్ టీజర్ ను సినిమా పెట్టుబడి దారులు విడుదల చేయడం విశేషం.
సుమారుగా ఒకటిన్నర నిమిషం కొనసాగే డబల్ ఇస్మార్ట్ టీజర్ అభిమానులకు ఆకట్టుకొంది. మాస్ రోల్ లో రామ్ నటించి ప్రేక్షకులను, ఇటు తన అభిమానులను మెప్పించారు. మొదటి భాగంలో క్రాక్ పెట్టిన హీరో రామ్ రెండో భాగానికి దుమ్ము దులిపేశారు. ఒకటిన్నర నిమిషంలో చెప్పిన డైలాగ్ లతో సౌండ్ బాక్స్ లు దద్దరిలోపోతున్నాయి. డబల్ మీనింగ్ డైలాగ్ లు దుమ్మురేపుతున్నాయి.
ఈ రెండో భాగంలో సినిమాకు సంజయ్ దత్ విలాన్ గా రావడం బాగా కలిసొచ్చింది. ఒక బలమైన విలన్ తెలుగు సినిమాలో నటించాడంటే అంచనాలు కూడా బాగానే ఉంటాయి. అందులో హిందీ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన నటుడు కావడంతో ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సినిమాను నిర్మిస్తారు అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. నవ్వులు కోసం అలీని కూడా ఎంపిక చేయడం అభిమానులకు ఆనందంగా ఉంది. టీజర్ లో హీరోయిన్ ను అభిమానుల కోరికకు తగిన విదంగా చూపించక పోవడంతో కొంత మేరకు నిరాశకు లోనయ్యారు .