SBI : స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (SBI) ఉద్యోగ నియామకాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంక్ లో క్లర్క్ పోస్టులను నియమించడానికి ప్రకటన విడుదల అయ్యింది. డిసెంబర్ 17 నుంచి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 క్లర్క్ ఖాళీలు భర్తీ కానున్నాయి.
ధరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువతీ, యువకులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచిఏదేని డిగ్రీ ఉతీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 01, 2024 నాటికి 20 నుంచి 28 మధ్య ఉండాలి. ఏప్రిల్ 02, 1996 కంటే ముందు ఏప్రిల్ 01, 2004 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్, ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 17 నుంచి 2025 జనవరి 7 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ఎస్, డీఎక్స్ఎస్ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.