YS Jagan : విజయవాడ లో వరద బాధితుల భాదలు తీరడంలేదు. ఐదు రోజులు అయినప్పటికీ నేటికీ కూడా ప్రజలు తినడానికి నోచుకోవడంలేదు. ఇల్లు, పొలము, చేను అంతా కూడా బురదలో చిక్కుకుపోయింది. భాదితులు కోలుకోడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం అంత కూడా రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలని తన అనుచరులతో బయలుదేరారు. విజయవాడ రాజరాజేశ్వరి పేట లో వరద బాధితులను పరామర్శించడానికి తన బలగంతో తరలివెళ్లారు. వరదలు వచ్చి ఐదు రోజులు అయిన తరువాత ఇప్పుడు వస్తున్నారా అంటూ బాధితులు ఒక్కసారిగా నిలదీశారు. దింతో జగన్, ఆయన అనుచరులు అంతా ఒక్కసారిగా ముఖం చాటేసుకోక తప్పలేదు. ఇంకా అక్కడే ఉంటె పరిస్థితి చేయిదాటి పోతుందని భావించారు. విధిలేని పరిస్థితిల్లో అక్కడి నుంచి జగన్ తోపాటు అయన సహచరులు వెళ్లిపోయారు.
రాజరాజేశ్వరిపేటలో కేవలం రెండు గంటల్లోనే జగన్ పర్యటన ముగిసింది. కాలనీలో కనీసం అరకిలోమీటరు దూరం కూడా జగన్ పర్యటించ కుండానే వెళ్ళిపోయారు. వరదలతో తామంతా తిండి లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వస్తారా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అంటూ మహిళలు నిలదీయడంతో జగన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రజల ఆగ్రహాన్ని గమనించి అతి తక్కువ సమయంలోనే తన పర్యటన ముగించక తప్పలేదు.