CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి హామీల అమలుకు కృషిచేస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను దశల వారిగా ప్రజల్లోకి తీసుకు వస్తున్నారు. రైతు రుణమాఫీ హామీ ఛాలెంజ్ గా తీసుకొని అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత విద్యుత్, రూ : 500 వంట గ్యాస్ సరఫరా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ప్రకటించారు. స్కిల్ డెవలప్ కేంద్రాన్ని ప్రారంభించి నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రధానంగా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. విధివిధానాలు కూడా ఖరారు అయ్యాయి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడమే మిగిలి ఉంది. కొత్తగా రేషన్ కార్డు మంజూరైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోడానికి అవకాశం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డు ప్రక్రియ కు సంబందించిన విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
మహిళలకు ప్రతి నెల భృతి కింద ఇచ్చే రూ : 2500 పథకాన్ని ఎప్పటినుంచి అమలుచేసేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిదంగా రైతు భరోసా పథకానికి సంబందించిన విధి విధానాలను కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.