Bread : సాధారణంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నవారు బ్రెడ్ తింటారు. కొందరు అల్ఫాహారంగా తింటారు. కానీ బ్రెడ్ తింటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో చాలా మందికి తెలియదు. సాధారణ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అనేవి రెండు రకాలు. ఈ రెండింటిలో ఏది మంచిదనే ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
మామూలు గా చాలా మంది సాధారణమైన బ్రెడ్ తింటారు. ఈ బ్రెడ్ లో ఫైబర్ ఉండదు. ఫైబర్ లేని కారణంగా మలవిసర్జనం లో ఇబ్బంది ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థ కూడా బలహీనమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య కూడా తలెత్తుతుంది.
బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండితో తయారవుతుంది. కాబట్టి దీన్ని తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. తిన్నటువంటి ఇతర ఆహార పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి.
సాధారణ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తింటే క్యాన్సర్ వస్తుందనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.