Tulsi Leaves : అనేక రకాల వ్యాధులతో పలువురు సతమతమవుతున్నారు. వ్యాధి నయం కావడానికి ఆసుపత్రి ఖర్చుకు వెనుకాడటం లేదు. వ్యాధుల్లో డయాబెటిస్ సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిని నయం చేసుకోడానికి అనేక మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అటువంటి వారికి తులసి మొక్క మంచి ఔషధం. ఒక్క మధుమేహం వారికే కాకుండా ఇతర జబ్బులను కూడా నయం చేస్తుంది తులసి మొక్క. ఆరోగ్యానికి కూడా తులసి దివ్య ఔషధమని వైద్య శాస్త్రం చెబుతోంది.
మధుమోహం ఉన్నవారు వ్యాధిని తగ్గించుకోడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారికి తులసి మొక్క దివ్య ఔషధం. ఈ మొక్కలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది తులసి ఆకులను తప్పనిసరిగా తినాలి. ఆ విదంగా తిన్నచో శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఎలాంటి వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.
తులసి ఆకులను ప్రతిరోజు తిన్నచో క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికి రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది.తులసి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు అదికంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తులసి ఆకుల రసం ఎక్కువగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తులసి ఆకులు తినడం వలన మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియ గుణాలు అధికంగా ఉంటాయి. తులసి ఆకులు తినడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, శ్వాసకోశ సమస్యలు, కడుపు, మూత్ర సంబంధిత రుగ్మతలు, కడుపు పూతల, చర్మ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.తులసి ఆకులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీర సగటు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.