Good Health : మెంతులు తినడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలుసు. అవి కాస్త చేదుగా, వగరుగా ఉంటాయి. మధుమోహం ఉన్నవారు వాటిని తినడం వలన వ్యాధి అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతారు. కానీ మెంతులు తినడం కంటే మొలకెత్తిన మెంతి గింజలను తినడం వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మొలకెత్తిన మెంతి విత్తనాలను ఉదయం పూట పరిగడుపున తినడం వలన అనేక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మొలకెత్తిన మెంతి గింజలను తినడం వలన మన శరీరానికి అనేక విధాలుగా పోషకాలు అందుతాయి. మధుమేహం వ్యాధితో పాటు మరికొన్ని వ్యాధులు కూడా నయమవుతాయి. మధుమేహం ఉన్నవారు మెంతికూర తినాలి. ప్రతిరోజూ పావు చెంచా మొలకెత్తిన గింజలను తినడం వలన ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తగ్గిపోతుంది.
మొలకెత్తిన మెంతులు తినడం వలన గుండె ఆరోగ్యముగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మహిళలకు రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్, బీపీ, మలబద్ధకంతో బాధపడుతున్నవారికి కూడా మొలకెత్తిన మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.