Home » Dr.Vivek : మున్సిపల్ శాఖ ను కోరుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వివేక్

Dr.Vivek : మున్సిపల్ శాఖ ను కోరుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వివేక్

Dr.Vivek : చెన్నూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి. అయన అనుకున్న కోరిక నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కావాలనుకున్నారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఆయనకు శాఖను కేటాయించాల్సి ఉంది. ఆయన మంత్రిగా భాద్యతలు చేపట్టిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం విద్యా శాఖ మంత్రి గా భాద్యతలు చేపట్టబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన మనసులో మరో శాఖ ఉంది.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో మున్సిపల్, హోమ్, విద్య, కార్మిక శాఖలు ఉన్నవి. కానీ వివేక్ కు విద్యా శాఖ పై అంతగా ఆసక్తి లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ముందుగా హోం శాఖపై గట్టి ప్రయత్నం చేయనున్నారని సమాచారం. ఒకవేళ హోం మినిస్టర్ పోస్ట్ దక్కని నేపథ్యంలో మున్సిపల్ శాఖ కావాలని గట్టి ప్రయత్నం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. కార్మిక శాఖ పై కూడా ఆయనకు అంతగా ఆసక్తి లేదని తెలిసింది.

హోం శాఖ ఇవ్వని నేపథ్యంలో మున్సిపల్ శాఖ కావాలని గట్టిగ కోరే అవకాశం ఉందని సమాచారం. మున్సిపల్ శాఖ ను కోరడంలో విశేషం కూడా ఉంది. ఆ శాఖను తీసుకుంటే తన నియోజకవర్గంలో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీలు ఉన్నవి. మున్సిపల్ మంత్రి అయిన నేపథ్యంలో ఈ మూడు మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కార్యకర్తలకు కూడా ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆయనకు రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ ఆలోచనతోనే ఎమ్మెల్యే వివేక్ మున్సిపల్ శాఖను దక్కించుకోవాలని తనదయిన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *