Anjeer : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది ఉదయం, రాత్రి వేల ఆహారంగా పండ్లను తింటున్నారు. షుగర్, బీపీ ఉన్నవారు తినే పండ్లు ఉన్నవి. తినకూడని పండ్లు కూడా ఉన్నవి. కానీ ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారు అన్ని రకాల పండ్లు తినడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ అంజీర్ పండు అతిగా తింటే ఆరోగ్యవంతులు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్న వారు అంజీర్ తినరాదు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. గుండెపై ప్రభావం చూపు తుంది. వీటిని సరిగ్గా సమతుల్య పరిమాణంలో ఆరోగ్య నిపుణుల సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది. జీర్ణవ్యవస్థ తో ఇబ్బంది పడేవారు అంజీర్ తినరాదు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్టపై ప్రభావం చూపుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు కూడా తినరాదు. మూత్ర పిండాల సమస్యతో బాధపడేవారు కూడా అంజీర్ తినరాదు.
అంజీర్ పండ్లలో కేలరీలు అధికంగా ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తినరాదు. వీటిలో చక్కర శాతం అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తినకూడదు. అంజీర పండ్లతో అలెర్జీ కొందరికి అలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తరువాతనే అంజీర్ తినడం మంచిది.