Telugu film : తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, టి కృష్ణ, కోదండ రాంరెడ్డి తదితరులు ఎందరో ఉన్నారు. వారి తరం మారింది. ఇటీవల దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరు వినబడుతోంది. దర్శకుడు అంటే ఆయనే. ఆలా ఉండాలి సినిమాలు అంటున్నారు సినిమా ప్రేమికులు. కానీ ఆయన పేరు కూడా మరచిపోయే కాలం వచ్చినట్టుంది.
తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఇప్పుడు పరిశ్రమలో ఎక్కడ విన్నా ఆయన పేరే పలుకుతున్నారు. ప్రస్తుతానికి ఆయన హవానడుస్తోంది తెలుగు పరిశ్రమలో. ఆయనే అనిల్ రావిపూడి. ఆయన తీసిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. తక్కువ సమయంలో సినిమాలు పూర్తి చేస్తున్నాడనే పేరు వచ్చింది. అంతే కాదు తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను నిర్మిస్తున్నాడనే పేరు కూడా తెలుగు పరిశ్రమలో వచ్చింది.
తన పదేళ్ల సినిమా ప్రయాణంలో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఆ పది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న అనిల్ ఇప్పటికే మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ తో సినిమాలు తీశాడు. ఇప్పడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడానికి సిద్దమయ్యాడు.