Leaf Curry : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఆకు కూర బలాన్నిచ్చేవే. సాధారణంగా తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, బచ్చలికూర, గోంగూర వండుకొని తింటాము. వీటికి సంబంధించిన మరో ఆకు కూర ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఏడాదికాలం పాటు దొరుకుతుంది. ఆ ఆకు కూర పేరు… పొన్నగంటి ఆకు కూర. ఈ ఆకు కూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ ఆకు కూర తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసు కుందాం.
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు రావు.
ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు ఈ ఆకు కూర తింటే ఆరోగ్యవంతులవుతారు.
షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు పొన్నగంటి కూరను తింటే షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఈ కూర తింటే శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలు ఉంటె నశిస్తాయి. కంటి సమస్యలు కూడా పరిస్కారం అవుతాయి.
నోటు : ఈ వివరాలు కేవలం వైద్య నిపుణుల ఆధారంగా ఇవ్వబడింది