Kamareddi : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని స్వచ్చంద సేవ నిర్వాహకుడు కొరివి నరసింహులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నరసింహులు కామారెడ్డి జిల్లా బీబీపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ హామీలను మాత్రమే నెరవేర్చారు. కానీ…….
రైతు రుణమాఫీ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా అమలు కాలేదని నరసింహులు ఆరోపించారు. రూ : 50 వేల ఋణం కూడా నేటికీ మాఫీ కాలేదన్నారు. యాబై వేల ఋణం మాఫీ చేయని మీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణాన్ని ఏవిదంగా మాఫీ చేస్తారని అయన ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ప్రశ్నించారు. అనేక మంది రైతులు నేటికీ కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.
బీసీ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. బీసీ లకు సంభందించిన ఉపాధి పథకాలకు నిధులు వెంటనే మంజూరు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే నెరవేర్చాలని కోరారు.