Home » BMW EV Scooter : బీఎండబ్ల్యూ సీఈ 04 స్కూటర్ వచ్చేస్తోంది

BMW EV Scooter : బీఎండబ్ల్యూ సీఈ 04 స్కూటర్ వచ్చేస్తోంది

BMW EV Scooter : భారత దేశములో ఆటో మొబైల్ వ్యాపార రంగం దూసుకుపోతోంది. అందులో EV స్కూటర్ లు మార్కెట్ లో తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. పోటీ ప్రపంచంలో ప్రధానమైన కంపెనీల నుంచి మొదలుకొని స్టార్టప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్ ల తయారీలో పోటీపడుతున్నాయి. ఈవీ స్కూటర్ లు సామాన్య మానవులతో పాటు ఉన్నత కుటుంబాల వరకు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో సూపర్ స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో కి తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది.

బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా ఎలక్ట్రిక్ 2డబ్ల్యూ స్కూటర్ ను ఇండియా లో లాంచ్ చేస్తుందని ఎప్పటి నుంచో ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆ వార్తలను ఎట్టకేలకు సంస్థ నిజం చేసింది. 2024, జూలై 24న బీఎండబ్ల్యూ సీఈ 04 లాంచ్‌ చేస్తున్నట్లు అధికారికంగా BMW సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కొత్తగా ఇండియా మార్కెట్ లోకి రాబోతున్న సీఈ 04 స్కూటర్ ఈ పాటికే నార్త్ అమెరికా, యూరప్ వంటి ప్రపంచ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 04లోని 8.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్‌లోని 11 బ్యాటరీ మాడ్యూళ్లలో ఒకటి. సీఈ 04 ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్‌లోని మోటరు, ఇది 42 బీహెచ్‌పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, 62 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసి సపోర్ట్ గ ఉంటుంది. బీఎండబ్ల్యూ సీఈ 04 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా 10.25 ఇంచుల స్క్రీన్‌‌తో అందుబాటులో ఉంటుంది.

దీని బరువు 231 కిలోలు. ఈ ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్ కేవలం 130 కిమీ పరిధిని, 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకువెళుతుంది. ఛార్జర్‌తో కేవలం 65 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. హార్డ్‌వేర్ కాంపోనెంట్‌లో 35 ఎంఎం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక మోనో-షాక్, బెల్ట్-డ్రైవ్, ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ ఫిట్టింగ్, వెనుకవైపు సింగిల్ డిస్క్ ఫిట్టింగ్, సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ వంటి ఆధునికంగా తయారు చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *