brandi shop : మందు బాబులకు చుక్క పడాల్సిందే. చుక్క పడితేనే ఆ కిక్కే వేరు ఉంటది. చుక్క, కిక్కు ఉంటేనే మద్యం ప్రియులకు మజా వస్తుంది. కొందరికి చుక్క వేస్తే ముక్క పడాల్సిందే. చుక్క ఉండి ముక్క లేకున్నా ఇబ్బందే. ముక్క ఉండి చుక్క లేకున్నా ఇబ్బందే. అటువంటి మందు బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. ముక్క ఉంచి చుక్క లేకుండా చేయడంతో మద్యం ప్రియులు తలపట్టుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు మూసి వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో చుక్క కోసం పక్క చూపులు చూస్తున్నారు.
ఈ నెల 17 న ఉదయం ఆరు గంటల నుంచి 18 తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మందు బాబులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరానికి మించి బీరు, బ్రాందీ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఆదేశాలు జరికగానే, మద్యం ప్రియులంతా కూడా బ్రాంది దుకాణాల బాట పట్టారు. ఇప్పడు బ్రాందీ షాప్ లకు రోజువారీ అయ్యే గిరాకీ కంటే ఎక్కువగానే కావడంతో దుకాణం యజమానులు కూడా సంబరపడిపోతున్నారు. బీరు, బ్రాందీ నిల్వలు కూడా పెంచేసుకుంటున్నారు.
కొందరు బ్రాందీ షాప్ యజమానులు బెల్ట్ షాప్ ల వద్ద నిల్వలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాందీ షాప్ కు వెనుక నుంచి ఇవ్వడానికి యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పట్టికి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు భారీ ఎత్తున భక్తి శ్రద్దలతో నిమజ్జనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా భక్తులు జరుపుకోడానికి ప్రభుత్వం రెండు రోజుల పాటు బ్రాంది షాప్ లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.