Coconut Water Benefits : దాహం వేస్తె ఎదో ఒక కూల్ డ్రింక్ తాగుతాం. ధర ఎంత అయినా పరవాలేదు అంటాం. ఆ కూల్ డ్రింక్ తో శరీరానికి ఎంత మేలు జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ స్వచ్ఛమైన కొబ్బరి నీటితో మన శరీరానికి కావలసినంత మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో కొబ్బరి నీరు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. ఈ కొబ్బరి నీటిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములతో పాటు అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ కాళీ కడుపుతో ఉదయం పూత కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీరు తాగడం సరైన సమయం ఉదయం. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉదయం పూట తాగడం మంచిది. దీనిలోని గుణాలు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తలనొప్పిని నివారిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది.
పొట్ట నిండుగా ఉంటుంది. వెంటనే ఆకలి కాదు. సకాలంలో భోజనం చేయడం వీలుకాని వారు కొబ్బరి నీరు తాగడంతో ఆకలి తీరుతుంది. ఉపశమనం కలుగుతుంది. శరీర బరువు కూడా తగ్గుతుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. వేసవిలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిన వారికీ కొబ్బరి నీళ్లు తాగించినచో వెంటనే కోలుకుంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొబ్బరి నీళ్లు తాగాలి .