Half Acre Land : ఉద్యోగం కంటే వ్యాపార రంగంలో స్థిరపడాలని కొందరి కోరిక. అదేవిదంగా వ్యవసాయ రంగంలో స్థిరపడి సంపాదించాలని మరికొందరి అభిలాష. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ మధ్య కొందరు యువత ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలనే ఆశయంతో స్టార్టప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ తో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం నేటి యువత కోసం….
ఇంటికి సమీపంలో పట్టణం ఉండి ఉండాలి. అదేవిదంగా పట్టణానికి సమీపంలో ఒక అర ఎకరం వ్యవసాయ భూమి కూడా అందుబాటులో ఉండాలి. ఆ అర ఎకరంలో కాలానికి అనుగుణంగా ఏడాదికి నాలుగు పంటలు పండించాలి. ఏడాదిలో నాలుగు రకాల పంటలను పండించినచో కనీసం ఖర్చులు పోను కనీసం నెలకు రు : 1.50 లక్ష వరకు సంపాదించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కాలానికి అనుగునంగా మొదటి పంటలో కూరగాయలు పండించాలి. వాటి కాత పూర్తయిన వెంటనే ఆకుకూరలు పండించాలి. వాటి తరువాత పుదీనా, కొత్తిమీర, మెంతి, ఉల్లి వంటి మసాలా దినుసులు పండించాలి. వీటి పంట పూర్తికాగానే తొందరగా చేతికి వచ్చే ఆవాల పంట వేసుకోవాలి. ఈ పంటలన్నీ పూర్తి కాగానే మొదట వేసిన కూరగాయల పంటలకు నేల సాగు చేసుకోవాలి. తిరిగి కూరగాయల పంటలతో మొదలు పెట్టాలి. ఇలా కాలాన్ని బట్టి పంటలు పండించినచో లాభాలు, చేతినిండా డబ్బు ఉంటుంది.
ఇలా పంటలు పండించే వారికి చిన్న ఆటో ఉంటె మరింత బాగుటుంది. పండించిన పంటలను సొంతగా ఉన్న వాహనంలో తీసుకెళ్లి సమీప పట్టణంలోని మార్కెట్లో విక్రయించుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబలో ఒకరు మార్కెట్ కు వెళ్ళి పండించిన పంటలను అమ్ముకొని వచ్చినా. మిగతా వారు చేనులో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దింతో కూలీల ఖర్చు కూడా ఉండదు. ఇలా కుటుంబం అంత కలిసి పనిచేస్తే నెలకు నెలకు రు : 1.50 లక్ష వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.