3 lakhs loan : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంలో మగవారితో సమానంగా మహిళలు పోటీపడి సాధిస్తున్నారు. అదేవిదంగా వ్యాపార రంగంలో కూడా మహిళలు పురుషులతో పోటీపడి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. వ్యాపారంలో స్థిరపడిన నారీమణులకు బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త శుభవార్త తీసుకు వచ్చింది. వడ్డీ లేకుండా రుణాలను అందిస్తోంది. మూడు లక్షల రుణాలను ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం పేరు “ఉద్యోగిని”. “వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్” పర్యవేక్షణలో దేశమంతా అమలవుతోంది. ఆ ఋణం పొందడానికి కావాల్సిన అర్హతలు, సర్టిఫికెట్లు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకం ద్వారా మహిళలు మూడు లక్షల వరకు ఋణం పొందే అవకాశం ఉంది. అంగవైకల్యం, వితంతువులు, దళిత మహిళలకు వడ్డీ లేకుండా ఋణం అందుతుంది. మిగిలిన వర్గాలకు చెందిన వారికీ మాత్రం 10 నుంచి 12 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం లెక్క ప్రకారం 30 శాతం వరకు కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉంది. 88 రకాల వ్యాపారాలకు అర్హులైన మహిళలకు లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంగవైకల్యం, వితంతువులకు ఋణ పరిమితి విధించలేదు ప్రభుత్వం.
కుటుంబ ఆదాయం, అర్హతలు, చేస్తున్న వ్యాపారం ఆధారంగా ఎక్కువ ఋణం పొందే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగిని పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే.భారతీయులై ఉండాలి. 18 నుంచి 55 సంవత్సరాల వయసు లోపు ఉన్న మహిళలు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 1,50,000 రూపాయలకు మించి ఉండరాదు. అవసరమైన లోన్ మొత్తం 3,00,000 మించరాదు.ఈ పథకం ద్వారా తీసుకునే రుణంపై ఎలాంటి సెక్యూరిటీ బ్యాంకు అధికారులు అడుగరాదని ప్రభుత్వం నిబంధనల్లో పొందుపరచింది.వైకల్యం లేదా వితంతువుల వార్షిక కుటుంబ ఆదాయం, వయోపరిమితి నిబంధన అంటూ ఏమీ లేదు. సిబిల్ స్కోర్ తప్పనిసరి. గతంలో ఏదయిన బ్యాంకు లో ఋణం ఉంటె ఈ పథకానికి అనర్హులు.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం కు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం కాపీని జతపరచాలి. కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ లకు సంబంధించిన జిరాక్స్ లతో కలిపి బ్యాంకు అధికారులకు అందజేయాలి. ఈ ఋణం కు సంబందించిన దరఖాస్తు ఫారం సంబంధిత బ్యాంకు లోనే అందుబాటులో ఉంటుంది. బ్యాంకు అధికారులు చెప్పిన సమయం ప్రకారం అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ఋణం లభిస్తుంది.