Panchangam : మేషం …..ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు రానున్నాయి. వ్యాపారస్తులకు చిన్న, చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వాటి వలన పెద్దగా నష్టాలు ఉండవు. నమ్మకస్తుల ఆలోచనలను పంచుకోండి. మహావిష్ణువు ధ్యానం చేస్తే అన్నింటా శుభం కలుగుతుంది.
వృషభం …..ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. గురుబలం ఉంది. దీనివలన ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నమ్మకస్తులే వివాదంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అప్పు అడిగితే మొహమాటం లేకుండా లేదని చెప్పాల్సిందే.
మిథునం ….. ఈ రాశి వారికి చేస్తున్న పనిలో విజయం కలుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు చేస్తున్న పనిలో ఆవేశానికి గురికావద్దు. దింతో ఆర్థిక నష్టాలు తప్పవు. ఆరోగ్యం పట్ల శ్రద్దగా ఉండాలి.
కర్కాటకం …. ఆ రాశి వారిని మనోబలమే ముందుకు నడిపిస్తుంది. గ్రహ దోషం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా వివాదాలకు వెళ్ళరాదు. కొందరు నమ్మినవారే ఆర్థికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తారు. పదిమందిలోకి వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉంటె అంత మంచిది. ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిరాశ పడరాదు.
సింహం …. ఈ రాశి వారికి ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. చేస్తున్న వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. శుక్రయోగం ఉన్నందున పట్టిందల్లా బంగారమే అవుతుంది.
కన్య ….. ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నవి. ఉద్యోగస్తులకు పదోన్నతి కూడా ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్య పరంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది.
తుల …. ఈ రాశి వారు మనోబలంతో చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజించాలి.
వృచ్చికం ….. ఈ రాశి వారు ప్రణాళిక బద్దంగా చేస్తున్న పనులను ముందుకు తీసుకువెళుతారు. చేసే పనుల్లో ఓపిక తప్పనిసరి. అందరిని నమ్మడానికి వీలులేదు. కొత్తగా చేపట్టే పనుల్లో తొందర పనికిరాదు. అప్పు ఇచ్చే ముందు ఆలోచన తప్పనిసరి.
మీనం … ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి మెండుగా ఉంది. శుక్రయోగం నడుస్తోంది. పట్టిందల్లా బంగారమే. ఇంటిలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు పై అధికారులతో అభినందించబడుతారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది.
కుంభం …. ఈ రాశి వారికి మనో బలం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వారం చివరలో కుటుంబ సభ్యులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగస్తులకు మంచి యోగం ఉంది. బంధువుల విషయంలో జాగ్రత్త అవసరం. నమ్మినవారే ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
మకరం …. ఈ రాశి వారికి శుభఘడియలు ఉన్నవి. చేస్తున్న పనిలో అభివృద్ధి ఉంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం, వస్తువు, ఇంటి స్థలం కొనే పరిస్థితి కూడా ఉంది.
ధనుస్సు …. ఈ రాశి వారు బుద్ది బలంతో చేస్తున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారం, కొత్త ప్రయత్నాలు చేసే వారికి శుభ ఘడియలు ఉన్నవి. ఇంటి స్థలం, ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
(ఈ రాశి ఫలాలు వేద పండితులు పంచాంగ ప్రకారం చెప్పినవి మాత్రమే )