Ethik school : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎతిక్ అకాడమీ స్కూల్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగ పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు….
ప్రతి విద్యార్థికి క్రీడా , సాంస్కృతిక అంశాలతో పాటు యోగ లో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి యోగ తప్పనిసరి. కాబట్టి విద్యార్ధి దశ నుంచే యోగాలో శిక్షణ పొందిన విద్యార్థులకు భవిష్యతులో కూడా ఆరోగ్యముగా ఉంటారన్నారు.
ఎతిక్ అకాడమీ పాఠశాలలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక, యోగ శిక్షణకు కూడా ప్రత్యేకంగా పీరియడ్ కేటాయిస్తున్నామన్నారు.
ఆటపాటలతో చదివినప్పుడే ప్రతి విద్యార్ధి ఆనందంగా, ఆరోగ్యముగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.