Sravana Masam : ప్రస్తుతము ఆషాఢమాసం నడుస్తోంది. సుమారుగా మరో నెల రోజులు పూర్తయితే శ్రావణ మాసం సందడి దాదాపుగా ప్రతి ఇంటిలో మొదలవుతుంది. ఉపవాసం, ప్రత్యేక పూజలు, వాయినం, వనభోజనాలు, వ్రతాలూ ఇలా ఎన్నో పూజలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది మాత్రం వచ్చే శ్రావణ మాసం కు ఏంతో ప్రత్యేకత ఉంది.ఆ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే నెలలో శ్రావణ మాసం రాబోతున్నది. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు, నాలుగు మంగళ వారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి. ఆ మూడు వారాలు కూడా శ్రావణ మాసానికి ప్రత్యేకమైనవే. దీనితో ప్రతి ఇంటిలో మహిళలు వ్రతాలూ, నోములు, పూజలతో సందడిగా ఉంటుంది. ఇంతకు ఈ మాసంలో మహిళలు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి. వాటి వలన వచ్చే అనుగ్రహం ఏమిటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం… ఈ నెల మొత్తం మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో తెలుగు సాంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ వరలక్ష్మీ వ్రతం , శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా దాదాపుగా ప్రతి ఇంటిలో చేస్తారు. వాటితోపాటు సోమవారం కూడా పూజలకు పవిత్రమైనదే. ఈ శ్రావణమాసం జులై 22 న ప్రారంభమై ఆగస్టు 19 న ముగుస్తుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు పూజలకు ప్రత్యేకం. అలాగే నాలుగు మంగళ, నాలుగు శుక్రవారాలు కూడా వస్తాయి. మహిళలు వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు.
అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఎంతో పవిత్రమైనది. వివాహితులు నిత్య సుమంగళీగా జీవించాలనే కోరికతో ప్రతి ఏట శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి కటాక్షం శాశ్వతంగా భక్తులపై ఉండటంతో కష్టనష్టాలకు లోను కాకుండా సంతోషంగా కుటుంబంతో గడుపుదామని మహిళల నమ్మకం. సిరి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. సాధారణంగా శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి కలిసివస్తాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని వివాహితులే చేసుకుంటారు. నూతన దంపతులు సంతానం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది శ్రవణంలో నాలుగు మంగళ వారాలు రాబోతున్నాయి. ఈ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్దలతో పూజిస్తారు. భక్తితో పార్వతి దేవిని పూజిస్తూ గౌరీ దేవిని కూడ కొలుస్తారు. ఆ వ్రతం చేసిన మహిళలకు తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని విశ్వాసం. కొత్త దంపతులు మంగళ గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. కొత్తగా పెళ్లి అయినా వారు వరుసగా ఐదేళ్లపాటు మంగళగౌరి వ్రతాన్ని చేసి తమ మొక్కులు తీర్చు కుంటారు. పెళ్లి అయిన మొదటి ఏడాది అమ్మగారి ఇంటిలో, ఆ తరువాత వరుసగా నాలుగేళ్ళ పాటు అత్తగారి ఇంటిలో వ్రతం చేస్తారు.