Cut Your Nails : పూర్వ కాలం నుంచి ఇంటిలో చేసే ప్రతి పనికి కొన్ని నియమాలు పాటించారు మన పెద్దలు. అవే నియమాలను నేటికి కూడా మనం పాటిస్తూనే ఉన్నాం. పెద్దలు పాటించిన నియమాల్లో సైన్స్, వాస్తు దాగి ఉన్నాయని శాస్త్రంలో స్పష్టంగా ఉందని కొందరు వేదం పండితులు కూడా చెబుతున్నారు.
మనం చేసే పనిలో మన చేతి గోర్లను కొందరు పళ్లతో కొరికి వేస్తారు. కొందరు బ్లేడ్ తో తీస్తారు. ఇంకొందరు నీల్ కట్టర్ తో తీసివేస్తారు. చేతి గోర్లను పెరిగినప్పుడు తీసివేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. పెరిగిన వాటిలో మురికి చేరుతుంది. దాంతో మన ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది. కాం చేతి గోర్లను తీయడానికి ఒక సమయం అంటూ ఉంటుందని పెద్దలు చెప్పారు. శాస్త్రంలో చెప్పబడింది.
చేతి గోర్లను వారంలో రెండు వారాల్లో తీయరాదు. ఒకటి మంగళ వారం. రెండోది శుక్రవారం. అదే విదంగా సూర్యుడు అస్తమించాడంటే కూడా గోర్లను తీయరాదు. సూర్యాస్తమయం తరువాత గోర్లను కత్తిరించరాదనే నియమం పూర్వ కాలం నుంచే వినబడుతోంది. సూర్యుడు అస్తమించిన తరువాత గోర్లను తీసినచో ఆర్థిక కష్టాలు వస్తాయని, అదేవిదంగా జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతాయని శాస్త్రంలో చెప్పబడింది.
చేతికి శని గ్రహానికి సంబంధం ఉంది. కాబట్టి సాయంత్రం అయిన తరువాత చేతి గోర్లను తీసినచో శని మొదలవుతుందని, దింతో ఆర్థిక కష్టాలు మొదలవుతాయని కొందరు వేద పండితులు చెబుతున్నారు. అదేవిదంగా అప్పులు సకాలంలో తీరక పోవడం, ఆదాయం తగ్గడం మొదలవుతుంది. శని గ్రహాన్ని పాలక గ్రహణంగా రాత్రిపూట భావిస్తారు. కాబట్టి రాత్రి సమయంలో గోర్లు తీయడం వలన శని గ్రహంతో పాటు రాహు గ్రహణం కూడా మనపై ప్రభావం చూపుతుందని వేద పండితులు చెబుతున్నారు.