Home » Ashadam Amavasya : ఆషాడం అమావాస్య…. శుభదినం

Ashadam Amavasya : ఆషాడం అమావాస్య…. శుభదినం

Ashadam Amavasya : ఆషాడ మాసం బోనాల పండుగకు ప్రత్యేకం. వనభోజనాలకు కూడా ఉత్తమమైన మాసమని చెబుతారు. ఇదే ఆషాడ మాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు వస్తాయి. కానీ ఆషాడంలో వచ్చే అమావాస్య పితృ అమావాస్యకు సమానమైనదిగా చెబుతారు జ్యోతిష్య పండితులు. అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసిన నేపథ్యంలో కాలసర్ప దోషం, పితృ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఆషాడ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుంది… ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం.

హిందూ కుటుంబాలకు అమావాస్య తిథి ఎంతో పవిత్రమైనది. ఆషాడ మాసంలోనే మరికొద్ది రోజుల్లో అమావాస్య రాబోతోంది. ఈ పవిత్రమైన రోజున స్నానం చేసి దానాలు చేసినచో ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆషాడం మాసంలో అమావాస్య రోజున కుటుంబ సభ్యుల్లో ఎవరైన చనిపోతే తమ కుటుంబ సభ్యులను చూసేందుకు కలలోకి వస్తారని వేదంలో చెప్పబడింది. అందుకే అమావాస్య రోజు కొన్ని కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో పితృ దోషం, కాలసర్ప దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఆషాడ మాసంలో అమావాస్య జూలై 5 ఉదయం 4:57 గంటలకు, శుక్రవారం రోజు మొదలవుతుంది. మరుసటి రోజు అంటే శనివారం తెల్లవారు జామున ఉదయం 4:26 వరకు అమావాస్య గడియ పూర్తవుతుంది. అమావాస్య రోజున ఇష్టమైన దేవుళ్ళకు దీపం పెట్టాలి. ఆరోజు మద్యం, మాంసం ఇంటిలో వండుకోరాదు. ఒకపూట భోజనముకె పరిమితమై ఉండాలి. ఇంటి ముందరకు బిచ్చగాళ్ళు ఎందరు వచ్చినా తోచినంత ఇచ్చి పంపించాలి. వట్టిగా పంపరాదు.

ఉదయం పూట స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయాలి. పూర్వీకుల పేర్లతో తోచినంత దానం చేయాలి. గుడి వద్ద ఉండే పేదవారికి బట్టలు, ఆహార పదార్థాలు, బియ్యపు పిండి ,ఉప్పు, పంచదార ,భోజనం సరుకులను పూర్వీకుల పేర్లతో దానం చేయండి. రావి చెట్టు కింద ఆవ నూనె తో దీపం వెలిగించాలి. ఎందుకంటే ఆ చెట్టులో పూర్వికులు ఉంటారు. అదేరోజు ఇంటికి దక్షిణం దిక్కు ఆవనూనె తో దీపం వెలిగించండి. వీటి వలన కాలసర్ప దోషం తో పాటు పితృ దోషం లలో ఉంటె తొలగిపోతుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *