Chanakya Neeti: రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే విషయాలను చెప్పడానికే అపర మేధావి ఆచార్య చాణక్యుడు పరిమితం కాలేదు. మానవుల జీవితాలకు అవసరమైన విషయాలపై కూడా చాణక్యుడు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసాడు. అతను చెప్పిన నీతి సూత్రాలను ఆలోచనలను, విధానాలను అమలుచేసిన వారు జీవితంలో సంతోషంగా, ఆనందమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఎదురుగా వస్తాయని అయన సూత్రాలను నమ్మిన కొందరు చెబుతారు. జీవితంలో కూడా విజయం సాదిస్తామంటారు. చాణక్యుడు చెప్పిన కొన్ని నీతి సూత్రాలు ఈ విదంగా ఉన్నాయి……
తనపై తనకు నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు విఫలం కారు. మరో విదంగా చెప్పాలంటే విశ్వాసం అనేది విజయానికి మూల సూత్రం అని చాణక్యుడు స్పష్టం చేసాడు. ఉత్సహంగా ఉంటె ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా మనం విజయం సాదిస్తామంటాడు చాణక్యుడు. అందుకే చేసే ప్రతిపనిని ఉత్సహంతో చేస్తే విజయం నీదే అవుతుంది.
నీతి కి మించిన సంపద ఏదీ లేదు. నీతి, నిజాయితీ, వ్యక్తిగత సామర్థ్యం ఉన్న వారు మాత్రమే విజయాలను చేరుకుంటారని అంటాడు చాణక్యుడు. కస్టపడి సంపాదించినదే వెలకట్టలేనిది. విజయం చేరుకోవాలంటే అందుకు కృషి, పట్టుదల, సామర్ధ్యం ఎంతో అవసరమని చాణక్యుడు స్పష్టం చేశాడు.
ప్రతి వ్యక్తి ఒక సంపద అనేది ఉంటది. దానిని ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు. ఎత్తుకెళ్లడానికి సాధ్యం కూడా కాదు. అదేమిటంటే జ్ఞానం అనే సంపద. ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను ప్రతి క్షణం పరిశీలించినప్పుడే అతను నిజజీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతాడని చాణక్యుడు చాటి చెప్పాడు.
ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక చోట శత్రువు అనే వ్యక్తి తప్పనిసరిగా ఉంటాడు. కాబట్టి అతన్ని నిత్యం కనిపెడుతూ ఉండాలి. శత్రువు అని దూరం పెట్టరాదు. అతనికి అందుబాటులో ఉండాలి. అతను ఏమి చేస్తున్నాడో కనిపెడుతూ ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడే అతని గుణాలు, ఉద్దేశ్యాలు, ఆలోచనల గురించి తెలుసుకుంటాం. తద్వారా శత్రువుల ఆలోచనలను విఫలం చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో స్పష్టం చేశాడు.