Bibipeta : కామారెడ్డి జిల్లా, బీబీపేట మండల కేంద్రంలో కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగింది. వేద పండితులు, మండలంలోని భక్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్క రించుకొని భక్తులు ఆలయాన్ని మామిడి తోరణాలు, రంగు, రంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
బిబిపేట మండల ఆర్యవైశ్య సంఘం వారు అభిషేకం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. కార్యక్రమం సందర్బంగా ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కొందరు కుంకుమ పూజతో అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదం పంపిణీచేశారు.