Home » Panchangam : ఈ వారంలో ఆ మూడు రాశుల వారికి అన్నింటా శుభమే

Panchangam : ఈ వారంలో ఆ మూడు రాశుల వారికి అన్నింటా శుభమే

Panchangam : వ్యక్తియొక్క జన్మ నక్షత్రం ప్రకారం గ్రహబలం, అదృష్టం, కలిసివచ్చే అవకాశాలు, అభివృద్ధి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముక్యంగా మూడు రాశుల వారికి వారియొక్క జాతకం ప్రకారం అన్నింటా శుభం జరుగుతుందని వేద పండితులు పంచాంగం ప్రకారం చెబుతున్నారు.

1-కర్కాటకరాశి ….. ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన కాలం. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు రానున్నాయి. నిలిచిపోయిన పనులు మొదలవుతాయి. పెట్టుబడులు అభివృద్ధిచెందుతాయి. పలు మార్గాల్లో ఆదాయం పెరగనుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి శుభవార్త అందుతుంది.

2-మిథునం ….. ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు అందనున్నాయి. తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులను కాదని కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. మీ సహకారం తీసుకొనే వారు మీ ఇంటికి వస్తారు. చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

3-వృషభం ….. చేస్తున్న పనులకు కలిసివచ్చే అవకాశం ఉంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్తగా వ్యవసాయ లేదా ఇంటి స్థలం, ఏదయిన వాహనం కొనే అవకాశం కూడా ఉంది. కొన్ని ఇబ్బందులు తొలిగిపోయి అవకాశం ఉంది. సమీప బంధువుల వల్ల మీ కుటుంబానికి మేలు జరుగుతుంది.

4-మేషం ….. ఆర్థిక ఫలాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు తోటివారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న పనులను మనోబలం ముందుకు తీసుకువెళుతుంది. పలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిపై తొందరపడరాదు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి అవకాశం ఉంది.

5-మీనం ….. మీ కుటుంబ అవసరాలకు సకాలంలో డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. చిన్న, చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అంతమాత్రాన నిరాశ పడకుండా చేస్తున్న పనులపై ద్రుష్టి పెట్టాలి. ముఖ్యమైన విషయాల్లో తొందర పడకుండా, కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.

6-వృచ్చికం …..అదృష్టకాలం కొనసాగుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు మంచి వాతావరణం ఉంది. ఉన్నతస్థితి గోచరిస్తోంది. ధన యోగం ఉంది. సకాలంలో డబ్బు చేతికందుతుంది. కుటుంబలో ఒకరికి శుభవార్త అందుతుంది. దూరమైనవారు దగ్గరయ్యే అవకాశం ఉంది. అటువంటివారి పై జాగ్రత్తగా ఉండాలి.

7-సింహరాశి …. శుక్ర గ్రహం అనుకూలంగా ఉంది. దీనివలన చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. గ్రహదోషం కూడా ఎక్కువగానే ఉంది. తీసుకునే నిర్ణయాల్లో తొందర అసలే పనికిరాదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మొహమాటం అసలే పనికిరాదు. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

8-కన్యరాశి …. ఉద్యోగ, వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధయిర్యంతో కొత్త పనులు ప్రారంభించాలి. అప్పులు ఇవ్వడం అసలే పనికిరాదు. ఇచ్చిన అవి తిరిగిరావు. ఆపద నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సలహాలు తప్పనిసరి.

9-తులారాశి ….. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూలమైన సమయం. భూమి, ఇల్లు కొనేటప్పుడు న్యాయసలహా తీసుకోవాలి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిందలు పడే అవకాశం కూడా ఉంది. పట్టుదలతో చేసిన పనుల్లో లాభాలు కనబడుతాయి.

10-మకరం….అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాల్లో తొందర పనికిరాదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు మంచి కాలం ఉంది. కావాలని సమీపస్తులు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తప్పనిసరి.

11- ధనుస్సు …..వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్యంగా ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది. కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. కొత్త స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

12-కుంభం ….. ఆర్థిక వనరులు సకాలంలో చేతికి అందుతాయి. చేస్తున్న పనుల్లో విజయాలు ఉన్నవి. సంపాదన పెరుగుతుంది. చేస్తున్న వ్యాపారం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇంటి స్థలం, వాహనం, ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది. భార్య, పిల్లలతో ఆనందంగా ఉంటారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *