Akshya Trutiya :
వేద పండితుల పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను హిందువులు సంప్రదాయం ప్రకారం మే పదో తేదీన జరుపుకోనున్నారు. ఆరోజున ప్రతి హిందూ కుటుంబం భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలతో పాటు బంగారం, వెండి ని తమ ఆర్థిక స్తోమతకు తగినట్టుగా కొనుగోలు చేసి లక్ష్మి దేవి వద్ద పెట్టి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు.
మే పదోతేదీ న ఉదయం 4-17 గంటలకు వైశాఖ శుక్ల తృతీయ తిది న అక్షయ తృతీయ ప్రారంభం అవుతుంది. అదేరోజు నుంచి మే 11 తేదీన తెల్లవారుజామున 02-50 గంటలకు అక్షయ తృతీయ ముహూర్తం ముగుస్తుంది. కాబట్టి తిది ప్రారంభమైన శుక్రవారం రోజున లక్ష్మి దేవి పూజలు చేయడం శుభం. లక్ష్మి దేవి పూజలను శుక్రవారం ఉదయం 5-33 గంటల నుంచి మొదలుకొని అదేరోజు మధ్యాహ్నం 12-18 గంటల వరకు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క లక్ష్మి దేవితో సమానమంటారు. అందుకనే అక్షయ తృతీయ రోజున ఇంటిలో కుండీలో కానీ, నేలపై గాని తులసి మొక్కను నాటుకోవడం మంచిది. నాటిన మొక్కకు పూజలు చేయండి. సూర్యుడు అస్తమించిన తరువాత నాటిన తులసి మొక్క వద్ద నెయ్యితో దీపం వెలిగించండి. మొక్క వద్ద చక్కర, బెల్లం తో చేసిన పిండి వంటను నైవేద్యముగా పెట్టండి. తులసి మొక్క చుట్టూ బేసి సంఖ్యా ప్రకారం ప్రదక్షణలు చేయండి. ఇలా చేయడం వలన ఏడాదంతా కూడా కుటుంబానికి శుభం జరుగుతుంది.
———————
EDITOR : P R YADAV
9603505050
———————