Army Jobs : ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం విద్యార్హతల ఆధారంగానే నియామకం చేపట్టనున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు నోటిఫికేషన్ లో తెలిపారు. రాతపరీక్ష లేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా లేకుండానే నియామకం చేయనున్నామని షార్ట్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నియామక ప్రకటన విడుదల అయ్యింది.
మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటన విడుదల అయ్యింది. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ joinindianarmy.nic.in ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతగలవారు 2024 ఆగష్టు 14 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. SSC (టెక్) పురుషులు – 350 పోస్టులు, SSC (టెక్) మహిళలు – 29 పోస్టులు, SSCW టెక్- 1 పోస్ట్, SSCW నాన్-టెక్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నవి. దరఖాస్తు చేసుకోడానికి అభ్యర్థుల కనీస వయోపరిమితి 20 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
నోటిఫికేషన్ లో పేర్కొన్న విదంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత కలిగి ఉండాలి. జనరల్/ ఓబీసీ/ SC/ ST అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నామని నోటిఫికేషన్ లో పేర్కొనబడింది.
ఇండియన్ ఆర్మీ SSC టెక్ జాబ్ ప్రొఫైల్‌లో ఫీల్డ్ ఇంజనీర్ (ఇంజనీరింగ్ కార్ప్స్), ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ (EME కార్ప్స్) , కమ్యూనికేషన్ ఇంజనీర్ (సిగ్నల్ కార్ప్స్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆధారంగా ఈ ఉద్యోగాల్లో చేరవచ్చు. శాశ్వత ఉద్యోగిగా నియామకం అయిన తర్వాత వారి పనితీరు, సీనియారిటీ, అనుభవం ఆధారంగా పదోన్నతులు వస్తాయి. SSC టెక్ ఆఫీసర్లు ప్రమోషన్ ద్వారా కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఉద్యోగాలకు పదోన్నతులు పొందవచ్చు.