Maddi Shanker : మందమర్రి కి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త మద్ది శంకర్ నివాసం ఉంటున్న సింగరేణి క్వాటర్ సమస్య వివాదాస్పదంగా మారింది. మందమర్రి ఏరియా సింగరేణి సంబంధిత అధికారులు శంకర్ క్వాటర్ కు సరఫరా చేస్తున్న తాగునీరు, కరెంట్ ను ఇటీవల తొలగించారు. ఈ విషయం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్ళింది. బాల్క సుమన్ సింగరేణి చైర్మన్ బలరాం దృష్టికి శంకర్ సమస్యను తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళ వారం మందమర్రికి వస్తున్నాడని పార్టీ వర్గాలు తెలిపాయి. శంకర్ సమస్యను బాల్క సుమన్ మందమర్రి ఏరియా సింగరేణి అధికారులతో చర్చించడానికే వస్తున్నట్టు తెలిసింది.
మా పార్టీ కార్యకర్త మద్ది శంకర్ తో క్వార్టర్ ఖాళీ చేయించే భాద్యత నాది. కానీ ఒక్క షరతు. ప్రస్తుతం మందమర్రి ఏరియాలో అక్రమంగా సింగరేణి క్వార్టర్లలో ఉన్నటువంటి వారందరిని ముందుగా ఖాళీ చేయించండి. వెంటనే మద్ది శంకర్ ఉంటున్న క్వాటర్ ఖాళీ చేస్తాడు అనే షరతును బాల్క సుమన్ సింగరేణి అధికారుల ముందు ఉంచనున్నాడని సమాచారం. లేదంటే ఇప్పుడు అందరు ఉంటున్న విదంగానే శంకర్ కూడా ఉంటాడు అనే వాదన ముందుకు రాబోతోంది.
ఇది ఇలా ఉండగా మందమర్రి ఏరియాలోని సుమారు మూడు వందల సింగరేణి క్వాటర్లలో కార్మికేతరులు ఉంటున్నారు. వారందరిని కూడా ఖాళీ చేయించాలి. ఒక్క శంకర్ క్వాటర్ కె తాగునీరు, విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపివేశారని సుమన్ సింగరేణి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. అక్రమంగా ఉంటున్న వారి క్వాటర్లలో ఎన్నింటికి తాగునీరు, విద్యుత్ సరఫరా చేశారంటూ అధికారులని నిలదీసే పరిస్థితి కూడా ఉందని తెలిసింది.
అదే విదంగా కొందరు నాయకులు రెండు నుంచి నాలుగు క్వాటర్ లు ఆక్రమించుకొన్నారు. అద్దె మాత్రం నాయకులే తీసుకుంటున్నారు. అంతే కాదు క్వాటర్లు అద్దెకు ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్న నాయకులు ఉన్నారు. ఈ వ్యవహారమంతా మీ దృష్టికి రాలేదా అని సుమన్ సింగరేణి అధికారులను ప్రశ్నించే అవకాశం కూడా ఉందని సమాచారం.సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు నాయకులు నిర్మాణాలు చేపట్టారు. వాటిని అద్దెకు కూడా ఇచ్చుకున్నారు. అటువంటి వాటి విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటూ బాల్క సుమన్ సింగరేణి అధికారులను నిలదీశే అవకాశం కూడా ఉందని తెలిసింది.