Ration card : గత తొమ్మిది ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుకు నోచుకోలేదు. రేషన్ కార్డు లేకపోవడంతో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు కూడా అర్హులైన వారు నోచుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ కార్డు మంజూరు చేయడానికి అర్హులైన వారి నుంచి ధరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమకు కార్డు మంజూరు అయ్యిందా ? లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎవరిని అడగాలో తెలియడంలేదు. రెవిన్యూ, మున్సిపాలిటీ అధికారులల్లో ఎవరిని అడిగినా స్పందన అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వెబ్ సైట్ లో తెలుసుకోడానికి అవకాశం ఉంది. ఈ విదంగా అర్హులైన లబ్ధిదారులు తెలుసుకోడానికి అవకాశం ఉంది. ఈ వివరాలు తెలుసుకోడానికి మీ వద్ద మొబైల్ ఫోన్, నెట్ సౌకర్యం ఉంటె సరిపోతుంది.
మొదట తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ హోమ్ పేజీలో ఎడమ వైపు కనిపించే ఆప్షన్లలో FSC Search పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే Ration Card Search అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ అప్సన్ పైన క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనబడుతాయి. ఆ అప్సన్ లల్లో FSC Application Search మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. సెర్చ్ విండో ఓపెన్ కాగానే….
ముందుగా మీ జిల్లా ను ఎంపిక చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ బాక్సు కనబడుతుంది. దరఖాస్తు చేసినప్పుడు మీ సేవ రసీదు నెంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు కింది వరుసలో మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీ రేషన్ కార్డు సంబంధిత అధికారుల విచారణలో రద్దు అయితే కూడా అందుకు సంబందించిన స్టేటస్ తెలుసుకోడానికి అవకాశం ఉంది. Status of Rejected Ration Card మీద క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు మీ రేషన్ కార్డు రద్దు అయ్యిందా ? లేదా ? అనే విషయం కూడా తెలిసిపోతుంది. అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ విధంగా మీకు రేషన్ కార్డు మంజూరు అయ్యిందా ? రద్దు అయ్యిందా అనే విషయాలు సులభంగా మీ మొబైల్ తోనే తెలుసుకోడానికి అవకాశం ఉంది.