CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు చిక్కకుండా అస్త్రాలు విసురుతున్నారు. తన పర్యటనలో కావచ్చు, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ఎక్కడైనా ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు గణాంకాలతో సహా తిప్పికొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే కౌంటర్ కు ప్రతిపక్షాలు సైతం అక్కడికే ఆగిపోతున్నారు.
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెక్రెటేరియట్ ప్రారంభం చేసిన నాటి నుంచి అక్కడ ఇప్పటివరకు ఎవరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి.
సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విగ్రహాన్ని తొలగిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ మాటలను తిప్పికొట్టే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. కేవలం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయి.
అందుకనే సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదో తేదీన ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. స్థల పరిశీలన కూడా చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. దింతో కేటీఆర్ మాటలను ఒకవైపు తిప్పికొడుతూనే, మరోవైపు తన వ్యూహాన్ని మార్చి ప్రతిపక్షాలకు చిక్కలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.