Michel Starc : గత ఏడాది కోల్ కతా రైడర్స్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం వేలంలో ఇరువై నాలుగు కోట్ల దెబ్బయ్ అయిదు లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన ఆటగాడిగా రికార్డు బద్దలు కొట్టాడు. కానీ ముగిసిన ఐపీఎల్ సీజన్ లో అయన తన అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఆడలేదనే విమర్శలు వచ్చాయి. ప్రేక్షకుల చప్పట్లను కూడా అందుకోలేక పోయారనే అభిప్రాయాలు క్రికెట్ మైదానాల్లో వ్యక్తం అయ్యాయి.
తాజాగా ముగిసిన తొమ్మిది మ్యాచ్ ల్లో ఆడి కేవలం ఏడు వికెట్లు మాత్రమే సాధించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆడిన ఆట తీరుపై ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురైనాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. నేను ఇంతే. నేను ఒక రకం. నా అట ఇంకో రకం అంటూ తన అట తాను ఆడాడు. ఒత్తిడిలో ఆయన ఆటను ఎవరు కూడా తట్టుకోలేరు. ప్రత్యర్థుల ఆటను ఎలా కట్టడి చేయాలో చాలా తెలిసిన క్రీడాకారుడు. పెద్ద మ్యాచ్ ల్లో ఆయన తన ప్రతాపాన్నిప్రత్యర్థులకు చూపిస్తాడు.
కీలక దశలో ఆడి జట్టు కు విజయాన్ని అందించి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించి, విమర్శకుల నోరు మూయించడమే మిచెల్ స్టార్క్ లక్ష్యం. పెద్ద, పెద్ద మ్యాచ్ లలో ఆడి తన ప్రతాపాన్ని చూపించడం అతనికి అలవాటే. ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ ను మూడు వికెట్లు పడగొట్టి తన పఫర్ ఏమిటో చూపించాడు. తాజాగా ఆదివారం ముగిసిన ఫైనల్ పోటీలో కీలకమైన దూకుడు మీదున్న అభిషేక్, త్రిపాఠి ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను ఇంటికి పంపి తన సత్తా ఏమిటో చూపించాడు. నమ్ముకున్న జట్టుకు విజయాన్ని అందించాడు మిచెల్ స్టార్క్.