Home » BRS Power : తెలంగాణాలో బిఆర్ఎస్ ఉనికి అనుమానమే ???

BRS Power : తెలంగాణాలో బిఆర్ఎస్ ఉనికి అనుమానమే ???

BRS Power : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు దఫాలుగా అధికారం చేపట్టారు. మూడోసారి అధికారం తనదేననే ధీమాలో పడిపోయారు. కానీ పార్టీ పరాజయం పాలైనది. అధికారం పోయింది. పార్టీ అధినేతగా, రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేతపట్టుకొని తిరుగులేని నాయకుడిగా తయారయ్యారు కేసీఆర్. కానీ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి బాస్ గా వ్యవహరించారు. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర నటించడం, మెప్పించడం ఆయనకు ఇష్టంలేదు.

రెండుసార్లు అధికారం చేపడితే రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేశారు. రెండుసార్లు సీఎల్పీ ని విలీనం చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ చేసిన రాజకీయ ప్రయోగాలను సీఎం రేవంత్ రెడ్డి చేయకుండా ఉండలేరు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలను తీసుకుంటారు. ఎవరైన కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ఇష్టం లేని వారు ఉంటె కాషాయం కండువా కప్పుకోడానికి వెళ్లడం ఖాయం. ఎందుకంటే 2019 ఎన్నికల కంటే 2023 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేల బలం రెట్టింపు అయ్యింది. కాషాయం నేతలు కూడా బలోపేతం అయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రములో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గూటికి కొందరు వెళ్లగా, మరికొందరు కమలం గూటికి వెళ్లడం ఖాయం.

రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో బిఆర్ఎస్ అదినేత కేసీఆర్ కఠినమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. పార్టీని కాపాడుకోవడం అంత చిన్న విషయం కాదు. పదేళ్లు తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ ఇప్పడు ప్రతిపక్ష నేత భాద్యతలు మోయడానికి ఆయనకు ఇష్టంలేదు. చేజేతులారా ఆయనే ఈ పరిస్థితిని తెచ్చుకున్నారని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ తో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్న నేపథ్యంలో కూతురు జైలు వరకు వెళ్లే పరిస్థితి వచ్చేది కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడు తున్నారు.

రాజకీయంగా బీజేపీ కి గట్టి పునాది తెలంగాణలో ఏర్పడింది. గులాబీ ఓట్లను కాషాయం నేతలే తమ ఖాతాలో వేసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడమే బీజేపీ కంకణం కట్టుకొంది. ఉన్న ఎమ్మెల్యే లలో కాంగ్రెస్ కు వెళ్ళేవాళ్ళు ఎందరో పసి గడుతోంది. మిగతా వారిని తన బుట్టలో వేసుకోడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు బిఆర్ఎస్ అధినేత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల తయారవుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేయడం విశేషం. మూడోసారి బీజేపీ కేంద్రంలో జెండా ఎగురవేయడం
కష్టం. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రకంపనలు కేసీఆర్ తట్టుకోవడం కష్టమే అవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉప ఉన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలైన సందర్భాల్లో ముఖం చాటేసిన సందర్భాలు ఉన్నాయి. తాను రాజభోగం అనుభవించిన ఆస్థానంలో మరొకరు అనుభవిస్తున్నారు. చూస్తూ, చూస్తూ ప్రతిపక్ష హోదాలో ఆయన పార్టీని మునుపటి మాదిరిగా నడపగలరా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి రాజకీయ వర్గాల్లో.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *