Home » Parrot : పచ్చని చిలుక తోడుంటే ఏమవుతుంది….

Parrot : పచ్చని చిలుక తోడుంటే ఏమవుతుంది….

Parrot : రామచిలుక పచ్చని అందం. కిల కిలలు పలుకులు. చూస్తే అందం. పలికితే ఆనందం. ఇంత అందమైన రామచిలుకను ఇంటిలో పెంచుకోవచ్చా ??. పెంచితే ఏమి జరుగుతుంది. ఒకవేళ పెంచాలను కుంటే ఇంటి ఆవరణలో ఏ దిక్కున గూడు ఏర్పాటు చేయాలి. వాస్తు శాస్త్రం కూడా రామచిలుక ను పెంచుకోవచ్చని చెబుతోంది. కొన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.

శాస్త్ర ప్రకారం ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిక్కున రామచిలుకను పంజరంలో పెట్టి అందులో పెంచుకోవచ్చు. పంజరంలో చిలుక సొంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇంటిలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రామచిలుక బొమ్మను ఇంటిలో తూర్పు, లేదా ఉత్తరం దిక్కులో పెట్టుకున్నా శుభం కలుగుతుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉంటె కూడా ఉపశమనం కలిగిస్తుంది. జీవితంలో ఆనందం కలుగజేస్తుంది.

రాహు, కేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గిపోతాయి. జ్యోతిష్యం ప్రకారం ఇంటిలో ఏమైనా దోషం ఉంటె కూడా తొలగిపోతుంది. పిల్లలు రామచిలుకతో గడపటం వలన ఆనందంగా గడుపుతారు. భార్య,భర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఇంటి ఆవరణలోకి పాములు చొరబడితే వాటిని గుర్తించి అరుస్తాయి. మనకు సంకేతాన్ని ఇస్తాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *