Harthik Pandya : ప్రముఖ టీం ఇండియా క్రికెట్ ప్లేయర్, ఐపీఎల్ ముంబై జట్టు సారథి హార్థిక్ పాండ్యకు కుటుంబం పరంగా ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లో తాను సారథ్యం వహిస్తున్న ముంబై జట్టు చివరి స్థానంలోకి వెళ్ళింది. ఓటమి భారంతో పాండ్యా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇంటి నుంచి ఊహించని వార్త రావడంతో మరింత కుంగిపోయారు. పాండ్యా పుట్టిన రోజు పురస్కరించుకొని ఆయన భార్య నటాషా గ్రీటింగ్స్ చెప్పలేదు. ఫోన్ ద్వారా ఆడియో, వీడియో రూపంలో కూడా విషెస్ చెప్పలేదు. ఇద్దరిమధ్య దూరం పెరిగినట్టుగా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఓటమి భారంతో ఉన్న పాండ్యాకు భార్య కూడా భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
నటాషా, పాండ్యా దంపతులు పర్యటనలో ఎక్కడికి వెళ్లినా ఆ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇద్దరు షేర్ చేసేవారు. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరికి సంబందించిం ఎలాంటి ఫోటోలు కూడా అభిమానులు చూడలేదు. కానీ హార్థిక్ పాండ్యా మాత్రం తన సోషల్ మీడియా ఖాతా నుంచి తన భార్య, కొడుకు ఫోటో లను తొలగించలేదు. దింతో విడిపోతున్నారనే వార్తలు అబద్దమని పాండ్యా అభిమానులు కండిస్తున్నారు.
నటాషా బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్. ఆమెను పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లు గడిచింది. వీరిద్దరికి ఒక బాబు. తాజాగా సోషల్ మీడియా లో విడాకుల పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా విడాకుల విషయంపై స్పందించలేదు. ఇద్దరిలో ఒక్కరి నుంచి కూడా విడాకుల ఖండన రాకపోవడంతో కొందరు అభిమానులు విడాకులు నిజమే కావచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.