Cricket : ఢిల్లీ జట్టు తరుపున ఆడుతూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. టి-20 వరల్డ్ కప్ లో చోటు కూడా దక్కింది. జట్టులో రిజర్వు స్థానం అయినప్పటికీ ఆ ఢిల్లీ పేసర్ అదృష్టంగానే భావిస్తున్నాడు. ఒకసారి జాతీయ జట్టులోకి వచ్చిన తరువాత ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడక తప్పదు. జాతీయ జట్టులోకి రావడానికి ఎంత కష్టపడుతారో, జట్టులో స్థానాన్ని కాపాడుకోడానికి అంతకు రెట్టింపు కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
26 ఏళ్ల ఢిల్లీ ఫెసర్ కుర్రాడు ఖలీల్ అహ్మద్ 2019 లో జాతీయ జట్టు తరుపున ఆడాడు. ఆరేళ్ళ తరువాత ఇప్పుడు ట్-20 వరల్డ్ కప్ తరుపున ఆడటానికి రిజర్వ్ జాబితాలో స్థానం దొరికింది. కానీ సుమారు నాలుగేళ్ళ పైబడి జట్టులో స్థానం వస్తుందో, రాదో అని బాధపడిన రోజులు సైతం ఉన్నాయని ఖలీల్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేసారు. ఖలీల్ అహ్మద్ IPL లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు IPL లో 12 మ్యాచ్ లు అడి 14 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు.
ఊహించినట్టుగానే మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు నా స్థానాన్ని కాపాడుకోడానికి కష్టపడాల్సిన అవసరం ఎంతో ఉంది. 2019 ఇండియా జట్టు తరపున ఆడాను . తిరిగి ఎప్పుడు జాతీయ జట్టు తరపున ఆడుతానా అని ఎదురుచూస్తూ ఉన్నాను. నాలుగున్నరేళ్ల తరువాత అవకాశం వచ్చింది. ఫాస్ట్ బౌలర్ గ నా ప్రతిభను చూపించుకోడానికి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టు విజయానికి కృషి చేస్తానని ఆ 26 ఏళ్ల ఢిల్లీ ఫేసెర్ కుర్రాడు ఖలీల్ అహ్మద్ బాహాటంగానే చెబుతున్నాడు.