Chennay Team : చెన్నయ్ సొంత గడ్డపై రాజస్థాన్ మ్యాచ్ ఆడింది. రాజస్థాన్ జట్టును చెన్నయ్ జట్టు మాత్రం ఒక అట ఆడుకొంది. రాజస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నయ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నయ్ ముందు 142 పరుగుల లక్ష్యం ముందు ఉంది. లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. చెన్నయ్ జట్టుకు ఈ విజయం ఏడోది కావడం విశేషం. తక్కువ లక్ష్యమే ముందు ఉన్నప్పటికీ చెన్నయ్ జట్టు ఆటగాళ్లు కొంతమేరకు కష్టపడాల్సి వచ్చింది. ఓడిపోతారని అనుకున్న అభిమానులకు చెన్నయ్ జట్టు గెలుపును ముద్దాడింది. దీనితో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకొంది. 20 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 141 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆదుకోవాల్సిన బ్యాట్స్ మెన్ లు కూడా అభిమానులను నిరాశ పరిచారు. జట్టుకు అత్యధిక పరుగులు సాధించి పెట్టాలనుకున్న బ్యాట్స్ మెన్ లు నిరాశ పరిచారు. చెన్నయ్ బౌలర్ల దాటికి ఒకరి తరువాత మరొకరు వెనుదిరిగారు. దీనితో రాజస్థాన్ జట్టు 141 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విజయం కోసం మైదానంలోకి దిగిన చెన్నయ్ జట్టు ముందు 142 పరుగుల లక్ష్యం ఉంది. విజయం సాధించడానికి 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది చెన్నయ్ జట్టు. సొంత గడ్డపై చెలరేగి రాజస్థాన్ పై చెన్నయ్ ఆటగాళ్లు విజయం సాధించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రాజస్థాన్ బౌలర్లు కూడా చెన్నయ్ ని ఓడించడానికి కష్టపడినా ఫలితం లభించలేదు. చెన్నయ్ జట్టుకు మొదట్లోనే రాజస్థాన్ నుంచి ఎదురుగాలి తగిలింది. ప్రధాన ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, అభిమానులను నిరాశ పరిచారు. వారి పరుగులకు రాజస్థాన్ బౌలర్లు కళ్లెం వేశారు. దింతో ఒక్కొక్కరు వెనుదిరగక తప్పలేదు. చెన్నయ్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తనదయిన శైలిలో భాద్యతగా ఆడి విజయానికి పునాది వేశాడు. జట్టు విజయం కోసం కెప్టెన్ ఆడి అడ్డుకోవడంతో చెన్నయ్ క్రీడాకారులు అభినందనలతో ముంచెత్తారు.