Suhasini : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రధానమైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు సవాల్ గా నిలిచింది. ఇక్కడి సిట్టింగ్ స్థానం ఖాళీకావడంతో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండటం ఖాయం. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. బిఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ వారసులు లేదంటే పార్టీ తరపున ఎవరిలో ఉంటారు. బీజేపీ నుంచి అభ్యర్థి పోటీచేయడం కొంత అనుమానమే. ఎందుకంటే కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటె బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించారు.
ఏపీ లో కూటమి బలంగా ఉంది. వాస్తవానికి మొదటి నుంచి జూబ్లీహిల్స్ స్థానం తెలుగు దేశం పార్టీదే. చనిపోయిన గోపినాథ్ మొదటి టీడీపీ అభ్యర్థిగానే విజయం సాధించారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన బిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి కూటమి అభ్యర్తిగా నందమూరి సుహాసిని బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కూటమి అభ్యర్థిగా నిలబడితే టీడీపీ తోపాటు బీజేపీ, జనసేన మద్దతుగా ప్రచారం చేస్తాయి.
జూబ్లీ హిల్స్ లో కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉంది. అందులో జూబ్లీ హిల్స్ స్థానం 2009 లో ఏర్పాటైనది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో గోపినాథ్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గెలిచిన తరువాత ఆయన బిఆర్ఎస్ లో చేరారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామజిక వర్గం కావడంతో పాటు, టీడీపీ కి మంచి పట్టు ఉంది. కూటమి అభ్యర్థిగా సుహాసిని ఉంటె మహిళల సానుభూతి కూడా విజయానికి తోడయ్యే అవకాశం కూడా ఉంది.