ఈడీకి బయపడే రాజీనామా
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు అరెస్ట్ అవుతుండగా, మరికొందరు పార్టీని వీడుతున్నారు.తాజాగా కేజ్రీవాల్ మంత్రివర్గంలోని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ ఆనంద్ ఎవరు ఊహించని రీతిలో మంత్రి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో తోటి మంత్రివర్గ సహచరులు ఆయన రాజీనామాకు గల కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయన వారికి అందుబాటులో లేరు.ఆయన రాజీనామా చేసేవరకు కూడా సమాచారం లీకు కాకపోవడం విశేషం.ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికలు జరుగబోయే ముందు పార్టీ పరిస్థితి ఇప్పటికే కుదితిలో పడ్డ ఎలుకలా తయారైనది.తాజాగా రాజకుమార్ రాజీనామా చేయడంతో పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
అవినీతిలో కూరుకుపోయిన పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి నిర్మూలన కోసం పుట్టిందన్నారు.అటువంటి పార్టీ అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడాన్ని తాను మానసికంగా తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.స్వయాన ముఖ్యమంత్రి అరెస్టు కావడం పార్టీకి తొలగించలేని మచ్చ లాంటి దన్నారు.లోకసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి చెడ్డపేరు రావడం సరిగాలేదన్నారు.అదేవిదంగా పార్టీలో దళితులకు సముచిత న్యాయం జరుగడంలేదన్నారు.సరైన గుర్తింపు లేకపోవడంతో దళితులు కూడా పార్టీకి రోజు రోజుకు దూరం అవుతున్నారని అన్నారు.పార్టీ పదవుల్లో కొనసాగుతున్నవారిని,ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిన దళితులకు పార్టీ పరంగా ఎలాంటి గౌరవం దక్కడంలేదని రాజకుమార్ ఈ సందర్బంగా ఆరోపించారు.అందుకే తాను మంత్రి పదవితోపాటు పార్టీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.అందుకే తాను పార్టీకి దూరం కావలసి వచ్చిందన్నారు.అవినీతిలో కూరుకుపోయిన పార్టీలో కొనసాగడం కంటే,స్వచ్చందంగా ఉండటమే మంచిదనే నిర్ణయంతో పార్టీ నుంచి బయటకు రావడం జరిగిందన్నారు.
ఈడీ కి భయపడ్డాడు… ..
ఈడీ కి భయపడే రాజ్ కుమార్ పార్టీ పదవితోపాటు,మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు సౌరబ్ భరద్వాజ్ ఆరోపించారు.రాజ్ కుమార్ పార్టీ నుంచి బయటకు వెళ్లినంత మాత్రాన ఆయనను పార్టీలో ఎవరు కూడా ద్వేషించడం లేదన్నారు.పార్టీకి మోసం చేసి వెళ్లాడని కూడా అనడంలేదన్నారు. ఈడీ బెదిరింపులకు భయపడే రాజ్ కుమార్ పార్టీకి,మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని పార్టీ నమ్ముతున్నదని సౌరబ్ భరద్వాజ్ అన్నారు.