Karimnagar Kadra : హైదరాబద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా సత్పలితాలను ఇస్తోంది. ప్రజలు హర్షిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో జేసీబీ లు, బుల్డోజర్లు పరుగెడుతున్నాయి. హైడ్రా అధికారుల వెనుకాల ప్రజలు అండగా నిలబడ్డారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా తన పని తాను చేసుకు వెళుతోంది. ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నష్ట పోయిన ప్రజలు మా ప్రాంతానికి కూడా హైడ్రా వంటి కమిషన్ ను తీసుకురావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ని కోరుతున్నారు. ఇప్పుడు కరీంనగర్ పట్టణ వాసులు మాకొక హైడ్రా వండి కాడ్రా కమిషన్ వేయాలని కోరుతున్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మంది గులాబీ నాయకుల అక్రమాలకు బలయ్యారు. పేదవారు కట్టుకున్న ఇళ్ళను కూలగొట్టారు. వారి స్థలాలను కబ్జా చేశారు. తిరిగి వారినే జైలుకు పంపారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతల పేరు చెప్పొకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు. కోట్లాది విలువైన ప్రభుత్వ భూములతో పాటు, పేదల భూములను సైతం కబ్జా చేసి సొమ్ము చేసుకున్నారు.
బిఆర్ఎస్ నేతల అండతో చెలరేగుతున్న నాయకులను కూడా సంబంధిత శాఖల అధికారులు కూడా ఏమి చేయలేకపోయారు. అధికారం మారగానే కొందరు ముందడుగు వేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ మహంతి కి ఫిర్యాదు చేశారు. అయన స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై శాకపరమైన చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపారు. సీపీ మహంతి స్పందన చూసి అనేక మంది బాధితులు తమ భూములు కబ్జా అయినాయని ఫిర్యాదు చేయడం విశేషం.
ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో ఎస్సారెస్పీ కి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేశారు కొందరు అధికార బలంతో. పేదల ఇళ్లను సైతం కూలగొట్టి ఆక్రమించుకున్నారు కొందరు. ముఖ్యమంత్రి స్పందించి కరీంనగర్ లోనూ కాడ్రా ను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.