Home » రాజకీయాల్లోకి హీరో వెంకటేష్

రాజకీయాల్లోకి హీరో వెంకటేష్

Hero venkatesh : ప్రముఖ తెలుగు సినిమా నటుడు, హీరో వెంకటేష్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన సమీప బంధువు, ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి పోటీ చేస్తున్నారు. సమీప బంధువు అంటే వెంకటేష్ కు రఘురాం రెడ్డి వియ్యంకుడు కూడా . రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కూడా రఘురాం రెడ్డి వియ్యంక్యులే అవుతారు. తన వియ్యంకునికి ఎంపీ టికెట్ ఇప్పించడానికి ఢిల్లీలో భారీ ఎత్తున చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు గెలిపించుకునే భారం మంత్రి శ్రీనివాస్ రెడ్డి పై పడింది. అంతే కాదు మరో వియ్యంకుడైన సినీ హీరో వెంకటేష్ పై కూడా గెలుపు భారం పడింది.

రఘురాం రెడ్డి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం లోని చేగొమ్మ స్వగ్రామం. వియ్యంకుడి గెలుపు కోసం సినీ హీరో రాజకీయ రంగు వేసుకోకతప్పడంలేదు. మే ఏడో తేదీ నుంచి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో హీరో వెంకటేష్ విస్తృత ప్రచారం చేయబోతున్నారు. కనీసం ఐదు రోజుల పాటు నటుడు వెంకటేష్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ఉండనున్నారని సమాచారం. వెంకటేష్ కోసం బస్సు యాత్రని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి సొంత ఊరు ఖమ్మం. రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. ఇద్దరిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను ఇచ్చి వివాహం చేశారు. అదేవిదంగా చిన్న కుమారుడు అర్జున్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డి ని ఇచ్చి వివాహం చేశారు.

ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అంతేకాదు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు. సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా 1985 నుంచి కొనసాగుతున్నారు. ఇపుడు వియ్యంకుడు అయిన రఘురాం రెడ్డి ని ఎంపీగా గెలిపించుకోడానికి హీరో వెంకటేష్ తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించి రాజకీయ రంగు వేసుకోడానికి సిద్ధమయ్యారు.

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *