Home » ప్రపంచకప్ క్రికెట్ జట్టు పర్యటన ఖరారు

ప్రపంచకప్ క్రికెట్ జట్టు పర్యటన ఖరారు

CRICKET WORLD CUP :
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రపంచ కప్ క్రికెట్ జట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమానులు జట్టులో చోటు దక్కుతుందా అని ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ పోటీలు నడుస్తున్నాయి. ఈపోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కుతుంది. జట్టుకు 15 మంది ఆటగాళ్లు అవసరం ఉంది. అజిత్ అగార్కర్ సారధ్యంలో సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. జట్టులో ఎవరెవరి స్థానాలు ఎక్కడెక్కడ భర్తీ అవుతాయో అనే పరిస్థితి అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. అదేవిదంగా రెండో వికెట్ కీపర్ ఎంపికపై కూడా చర్చ ఎంపిక కమిటీలో జరగాల్సి ఉంది.

ప్రపంచకప్ పోటీలో పాల్గొనే జట్టును మరి కొద్ధి రోజుల్లో ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. టీం ఇండియా నుంచి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ట్-20 వరల్డ్ కప్ పోటీలో పాల్గొనడానికి జట్టు జూన్ లో అమెరికా లేదా వెస్టిండీస్ దేశాల్లో పర్యటించనుంది.
జట్టు ఎంపిక పూర్తి కానప్పటికిని, పర్యటన మాత్రం ఖరారు అయ్యింది.

ఐపీఎల్ పోటీలు ముగియక ముందే వరల్డ్ కప్ పోటీలో పాల్గొనడానికి ఇండియా జట్టు బయలుదేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెలక్షన్ కమిటీ నివేదిక ప్రకారం మే 21న టీం ఇండియా జట్టు క్రీడాకారులు వరల్డ్ కప్ పోటీలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడు తున్నాయి.

ఆ క్రీడాకారులతో తలనొప్పి…. ఐపీఎల్ పోటీల్లో క్రీడాకారులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎవరెవరికి జట్టులో ఎక్కడెక్కడ స్థానం లభిస్తుందనేది అభిమానులకు ఆసక్తికరంగా ఉంది. అనేక స్థానాలపై ఆటగాళ్లను ఎంపిక చేయడం కమిటీకి కత్తి మీది సాములా తయారైనది. రెండో వికెట్ కీపర్ ఎంపిక ఇప్పుడు సెలక్షన్ కమిటీ కి పెద్ద తలనొప్పిల తయారైనది. కేఎల్ రాహుల్, సంజూ సాంసన్ ల మధ్యనే పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరిని రెండో వికెట్ కీపర్ గా ఎంపిక చేయాలనేది సమస్యగా మారింది. రిషబ్ పంత్ ఐపిల్ పోటీల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. దాదాపుగా అతనే మొదటి కీపర్ గా ఎంపిక అయినట్టే. అతని స్థానంలో రెండో వికెట్ కీపర్ గ ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలక్షన్ కమిటీ ఎటు తేల్చుకోలేక సతమతమవుతోంది.

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *