Home » Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు అలా ఉందేంటి ?

Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు అలా ఉందేంటి ?

Prakash Raj : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నో పాత్రల్లో విలక్షణ నటుడిగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ఆయనలో ఉన్న గొప్పతనం. గత ముప్ఫయ్ ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అభిమానులను సంపాదించుకున్నాడు. ఏడు భాషల్లో నటించి మెప్పించాడు. నాలుగు వందల సినిమాలను దాటాడు. ఒక్క నటనతోనే ఆయన సరిపెట్టుకోలేదు. బుల్లితెరలో కనిపించాడు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా చిత్రపరిశ్రమలో తన ప్రతిభను చాటుకున్నాడు.

సినిమాల్లో మాత్రం ఆయన అసలు పేరు ప్రకాష్ రాజ్ అనే అందరికి తెలుసు. కానీ వాస్తవానికి అసలు పేరు అదికాదు. ప్రకాష్ రాజ్ కు తల్లి దండ్రులు పెట్టిన అసలు పేరు ప్రకాష్ రాయ్. ఆయన తమ్ముడి పేరు ప్రసాద్ రాయ్. తమ్ముడు కూడా మంచి నటుడే. ప్రకాష్ రాజ్ తల్లి దండ్రులది ప్రేమ వివాహం. నాటకాలు చాలా ఇష్టం. అందుకనే సినిమాల్లోకి ప్రవేశించాడు.

సినిమాల్లో అవకాశాలు రావడంతో వెనుతిరిగి చూడలేదు. మొదట కన్నడ చిత్రాల్లో నటించారు. కె బాలచందర్ దర్శకత్వంలో డ్యూయెట్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత డబ్బింగ్ తో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. తెలుగులో మొట్ట మొదటి సినిమా సంకల్పం. అప్పటి నుంచి వరసగా నటిస్తూనే ఉన్నారు. అతని నటనకు ఎన్నో అవార్డులు అందాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *