Gaju Glass Tea : కొందరు ఇంటిలోనే చాయ్ తాగుతారు. హోటల్ కు వెళ్లరు. మరి కొందరు ఇంటితో పాటు హోటల్ లో కూడా చాయ్ తాగుతారు. ఇంకొందరు ఇంటిలో, హోటల్ లో, మిత్రుల ఇళ్లలో కూడా చాయ్ తాగుతారు. చాయ్ తాగడానికి మాత్రం వివిధ రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. పింగాణీ కప్ లో తాగుతారు. పేపర్ గ్లాస్ లో తాగుతారు. స్టీల్ గ్లాస్ ఉపయోగిస్తారు. మట్టి పాత్రలు కూడా ఇటీవల చాయ్ తాగడానికి అందుబాటులో వచ్చాయి.
రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా చాయ్ తాగుతారు. ఆ నాయకుల తల్లి,దండ్రులు కూడా పిల్లలతో కలిసి సేవిస్తారు. కొడుకులు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మంత్రులు అయితే వాల్ల తల్లిదండ్రుల చాయ్ తాగే విధానం కూడ ఓకే రేంజ్ లో ఉంటది. ఖరీదయిన స్థాయిలో చాయ్ తాగుతుంటారు. విలువైన వస్తువులలో చాయ్ తాగుతుంటారు. వెండి గ్లాసులో కూడా చాయ్ తాగే ఎమ్మెల్యేలు, వాల్ల తల్లి దండ్రులు కూడా ఈ రోజుల్లో కొందరు ఉన్నారు.
ఒక ఎమ్మెల్యే తల్లి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆమె ఒక కొడుకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. మరో కొడుకు కూడా నటుడే. కొందరు మనవలు కూడా సినీపరిశ్రమలో నటులే. ఇంకో కొడుకు చిత్ర పరిశ్రమలో ఉంటూనే రాజకీయ ప్రవేశం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన గెలిచింది గాజు గ్లాస్ గుర్తు పై . ఇప్పుడు ఆమె కొడుకు గాజు గ్లాస్ గుర్తుపై విజయం సాధించడంతో ఆ కన్న తల్లి సంబరపడిపోతోంది. కొడుకు గాజు గ్లాస్ గుర్తుపై గెలిచాడు కాబట్టి , ఇప్పటి నుంచి ఆమె గాజు గ్లాస్ లోనే ప్రతి రోజు చాయ్ తాగుతా అని శపథం చేసింది. ఆ శపథం చేసిన తల్లి ఎవరో కాదు జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కావడం విశేషం.