Five Rivers : దేశంలో అనేక నదులు ఉన్నాయి. చాలా వరకు నదులు సముద్రంలో కలుస్తాయి. కొన్ని నదులు దేశంలోనే ఎదో ఒక ప్రాంతంలో ముందుగా కలిసిన తరువాతనే, అక్కడి నుంచి ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయి. దేశంలో రెండు నదులు కలిసిన ప్రాంతాలు ఉన్నవి. మూడు నదులు కలిసిన ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగలో అలకనంద.. మందాకిని నదుల సంగమం. తెలంగాణలో త్రివేణి సంగమం, ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి మూడు నదుల సంగమం ఉంది. ఈ నదుల కలయిక గురించి చాలా మందికి తెలుసు. కానీ ఐదు నదులు కలిసిన ప్రాంతం ఎక్కడ ఉందొ చాల వరకు తెలియదు.
ఉత్తర ప్రదేశ్ లో ఒక అందమైన ప్రదేశం ఉంది. అక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఆనందంగా గడిపి వెళుతుంటారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్ జిల్లాలో ఔరయ్య, ఇటావా సరిహద్దులో ఒక విచిత్రమైన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఐదు సముద్రాలు కలుస్తాయి. ఈ ఐదు నదుల సంగమాన్ని పంచనాద్ అని కూడా పిలుస్తుంటారు. హిందువులకు ఈ ప్రాంతం అతి పవిత్రమైనదీతగా భావిస్తారు. ఈ ఐదు నదుల సంగమానికి మరొక పేరు కూడా ఉంది. మహా తీర్థరాజ్ అని కూడ పిలుస్తారు.