Court Bail : లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న నాయకులకు కోర్టులు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఏ మాత్రం కూడా కనబడుత లేదు. కేవలం అప్రూవర్ గా మారిన వారికీ మాత్రమే బెయిల్ వస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి జైలు లో ఏడాది నుంచి ఉంటున్నారు. ఆయనతో పాటు క్రేజీవాల్, కవితకు కూడ బెయిల్ రావడం లేదు. ముగ్గురు కూడా అప్రూవర్ గా మారకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కఠినంగానే నిబంధనల మేరకు వెళుతున్నాయి.
5 నెలల నుంచి ….
2024,మార్చ్ 15న కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. అప్పటి నుంచి ఆమెకు నేటి వరకు కూడా బెయిల్ రావడం లేదు. బెయిల్ కోసం ఆమె కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు సంస్థలు కూడా తమదయిన పద్ధతుల్లో కోర్టులో తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతోంది. దింతో కవిత బెయిల్ ఆశలు అడియాశలే అవుతున్నాయి.
సుప్రీం కోర్ట్ కు ……
సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానంతో పాటు , ఢిల్లీ హై కోర్ట్ లో సైతం కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. అయినా ఏ మాత్రం ఆశలు కనిపించడం లేదు. వాదనలకు తగిన ఆధారం కనిపించకపోవడంతో కవిత కుటుంబ సభ్యులు సుప్రీం కోర్ట్ కు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. బెయిల్ రావడానికి అవసరమయిన మూలాల కోసం కవిత కుటుంబ సభ్యులు
ఢిల్లీ లో తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
క్రేజీవాల్ కు బెయిల్ వస్తేనే ….
క్రేజీవాల్ బెయిల్ తో కవిత బెయిల్ ముడిపడి ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రేజీవాల్ కు ముందుగా బెయిల్ వస్తేనే, కవిత బెయిల్ కు ఆధారం దొరుకుతుందని న్యాయవాదుల మాటగా ప్రచారం జరుగుతోంది. క్రేజివాల్ కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. క్రేజీవాల్ తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీం కోర్ట్ ల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సుప్రీం కోర్ట్ లో క్రేజీవాల్ కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో, అవే నిబంధనల మేరకు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అప్రూవర్ అయితేనే …….
మద్యం కుంభం కేసులో అరెస్ట్ అయిన వారిలో ఇప్పటి వరకు అప్రూవర్ గా మారిన వారికీ మాత్రమే బెయిల్ వచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయి ఏడాది కాలం గడిచిపోయింది. కవిత అరెస్ట్ అయి ఐదు నెలలు దాటి పోయింది. ఈ ముగ్గురు కూడా అప్రూవర్ గా మారడం లేదు. కేంద్ర దర్యాప్తు సంసలు కూడా వారి బెయిల్ విషయంలో కోర్టులో కఠినంగానే ఉన్నాయి.