Home » Ex MLA : మాజీ ఎమ్మెల్యే ను కలిసిన కౌన్సిలర్లు

Ex MLA : మాజీ ఎమ్మెల్యే ను కలిసిన కౌన్సిలర్లు

Ex MLA : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. పదేళ్లు అధికారం లో ఉన్న నాయకులకు ఒక్కసారిగా అధికారం పోవడంతో తలపట్టుకున్నారు. ఇంకేముంది కండువాలు మార్చుకున్నారు. కండువాలు మార్చుకున్న రాజకీయం ఎక్కువ శాతం మున్సిపల్ రాజకీయాల్లో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైనది. వెంటనే మున్సిపాలిటీల్లో అవిశ్వాసం మొదలైనది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ఎక్కువ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకొంది.

కానీ మంచిర్యాల జిల్లాలోని ఒక మున్సిపాలిటీ లో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జిల్లాలోని ఒక మున్సిపాల్టీకి చెందిన కొందరు గులాబీ కౌన్సిలర్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు రంగుల కండువా కప్పుకున్నారు. అంత సవ్యంగానే ఉంది.
కొత్త మురిపెంతో కొద్ధి రోజులు కాంగ్రెస్ పార్టీ లో సంతోషంగానే ఉన్నారు కౌన్సిలర్లు. ఉన్నవారితో వచ్చిన వారు అంత కలిసి మెలిసి ఉన్నారు. విందులు చేసుకున్నారు. కలిసిమెలిసి తిరిగారు. కానీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కౌన్సిలర్లు ఎందుకో ఇముడలేక పోయారు. కొందరు గులాబీ పార్టీ వదిలి వెళ్లినప్పటికీ ఆ మున్సిపాలిటీలో ఇంకా కొందరు కౌన్సిలర్లు గులాబీ పార్టీని పట్టుకొనే ఉన్నారు. అంతే కాదు ఆ మాజీ ఎమ్మెల్యేనే నమ్ముకొని ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూడా వదిలి వెళ్లిన వారు ఎంత కాలం అక్కడ ఉంటారో అని వేచిచూస్తున్నారు. తిరిగి వచ్చే కాలం తొందరలోనే ఉందని అనుకున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. తానూ ఊహించింది నిజమే అయ్యింది. ఆ మాజీ ఎమ్మెల్యే అనుమానం కళ కాకుండా నిజమే
అయ్యింది. వెళ్లిపోయిన కౌన్సిలర్లు ఇటీవల ఆ మాజీ ఎమ్మెల్యేను కలవడంతో జిల్లాలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. కలువడంతోనే సరిపెట్టుకోకుండా అక్కడ పడుతున్న బాధలను మాజీ ఎమ్మెల్యే ఎదుట కథలుగా చెప్పుకోవడం విశేషం. మీ వెంట ఉన్న పరిస్థితికి, అక్కడికి వెళ్లిన తరువాత ఏర్పడిన వాతావరణానికి ఎంతో తేడా ఉందని ఆ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *