Star Cricketer : కోర్ట్ తీర్పు ఆ స్టార్ క్రికెటర్ కు ఎంతో మేలు చేసింది. కోర్ట్ అతడు దోషి కాదని తీర్పు ఇవ్వడంతో ఊరట లభించింది. అంతే కాదు అతనికి వరల్డ్ కప్ లో ఆడేందుకు అనుమతి కూడా దొరికింది. దోషి కాదంటూ హై కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఇక తన దృష్టి అంతా కూడా ఇప్పడు ప్రపంచ కప్ పై పడింది.
నేపాల్ దేశానికి చెందిన సందీప్ లామిచ్చాన్ అనే క్రికెటర్ పై 2022 లో అత్యాచారం కేసు నమోదయినది. 17 ఏళ్ల మైనర్ అతనిపై కోర్ట్ కు వెళ్ళింది. నేపాల్ జిల్లా కోర్ట్ విచారణ చేపట్టి దోషిగా నిర్దారించింది. జిల్లా కోర్ట్ తీర్పు పై విచారంతో హై కోర్టును ఆశ్రయించాడు. హై కోర్ట్ న్యాయమూర్తులు కేసును విచారించి సందీప్ నిర్దోషి అని ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాదు జిల్లా కోర్ట్ ఇచ్చిన తీర్పును కూడా తప్పు అని తేల్చి చెప్పింది.
మైనర్ ఆరోపించినట్టుగా కేసులో సరైన ఆధారాలు లేవని హై కోర్ట్ తేల్చి చెప్పింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హై కోర్ట్ జిల్లా కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా తప్పుపట్టడం విశేషం. ఏపక్షంగా తీర్పు ఇచ్చినందుకు జిల్లా కోర్ట్ ను కూడా హై కోర్ట్ తప్పు పట్టి మందలించింది.
మైనర్ మోపిన కేసు నుంచి నిర్దోషిగా సందీప్ బయటపడ్డాడు. ఇప్పుడు సందీప్ వరల్డ్ కప్ లో నేపాల్ జట్టు తరుపున ఆడడానికి అవకాశం ఏర్పడింది. సందీప్ వరల్డ్ కప్ లో ఆడుతున్నాడని తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.