Telangana egg politics: తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైనది. మూడు పార్టీల మధ్య హోరా హోరి ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు హామీలు గుపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దార్లన్నింటిని వాడుకుంటున్నారు ప్రధాన పార్టీల నేతలు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోపాటు బిఆర్ఎస్ ను లక్ష్యముగా చేసుకొంది. బీజేపీ కాంగ్రెస్ తోపాటు బిఆర్ఎస్ ను ఎండగడుతోంది. బిఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీ ని విమర్శిస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు సవాల్ గా నిలిచాయి. ప్రతి పక్ష పార్టీలు కూడా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా రెండు పార్టీలను కోలుకోకుండా చేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. జూన్ నాలుగున మూడు పార్టీల జాతకాలు చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం గుడ్డు రాజకీయం నడుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి హోదాలో ఎం చేశారని రేవంత్ రెడ్డి సభల్లో ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కు బీజేపీ ఎం ఇచ్చింది. గాడిద గుడ్డు ఇచ్చింది అంటూ గుడ్డును చూపిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అయన ఎక్కడ ప్రచారం చేసినా ప్రజలకు గుడ్డునే చూపిస్తున్నారు. తెలంగాణకు బీజేపీ పెద్దలు గాడిద గుడ్డు ఇచ్చింది. అంటూ పదే పదే చూపిస్తూ ప్రజలను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రధాని మోది రాష్ట్రానికి ఇప్పటివరకు ఏమి మేలు చేశారు. మోదీ ఏమి ఇచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చారు అంటూ ఎక్కడకి వెళ్లిన తనదయిన శైలిలో బీజేపీ పై విరుచుకు పడుతున్నారు. ప్రజలతో గుడ్డుకు సంబందించిన ప్రశ్నలు వేస్తూ జవాబు రప్పిస్తున్నారు. ఒకవైపు గులాబీ పార్టీ పై ఎదురు దాడులు చేస్తూనే, మరోవైపు బీజేపీ పై గుడ్డు తో ఎదురు దాడికి పాల్పడుతున్నారు. గుడ్డు తో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం బీజేపీ నాయకులకు తలనొప్పిగా తయారైనది. మొత్తానికి గుడ్డు ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్రంలో నిలిచించి.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం లో గాడిద గుడ్డు డైలాగుతోనే ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది. బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఏమిచ్చింది గాడిద గుడ్డు ఇచ్చింది అనాలంటూ ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు. దీన్ని పదే, పదే జనాలతో అనిపిస్తూ వారిలో ఉత్సహాన్ని నింపుతున్నారు.
రేవంత్ రెడ్డి గుడ్డు ప్రచారంపై బీజేపీ ప్రధాన నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హామీలు నెరవేర్చ కుండా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ఇస్తున్నది అని బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. గాడిద గుడ్డును చూపిస్తూ ప్రచారం చేయడం సరికాదని బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ సైతం సీఎం ప్రసంగంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం తన స్థాయిని తగ్గించుకొని గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేయడం సరికాదని లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
–————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————–