Home » 15 ఏళ్ల కిందటి కోరిక జక్కన్నతో తీరిందంటున్న సినీ నిర్మాత

15 ఏళ్ల కిందటి కోరిక జక్కన్నతో తీరిందంటున్న సినీ నిర్మాత

Rajamouli New sinima :ప్రముఖ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతానికి తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ చేస్తూనే, మరొక సినిమా గురించి ఆయన ఆలోచనల్లో మునిగిపోతారు. రాజమౌళి అంటే అదే జక్కన్న తో సినిమా తీయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పలువురు పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి చర్చించడానికి కనీసం సమయం అయినా ఇవ్వాలని కోరేవారు ఆయన ఇంటిముందు క్యూ కడుతున్నారు. జక్కన్నతో సినిమా తీస్తే చాలు కనక వర్షం కురుస్తుంది ఆ నిర్మాత ఇంటిలో. ఎంత ఖర్చు అయినా సరే పెట్టుబడి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఏళ్ల తరబడి జక్కన్న కోసం ఎదురుచూస్తున్నపెట్టుబడిదారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారంటే అది జక్కన్న కు ఉన్న తెలివితేటలకు ఒక తార్కాణం. అంతర్జాతీయ స్థాయిలో ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, నాటు,నాటు పాట కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, ఆస్కార్ అవార్డు రావడమే ప్రధాన కారణం.

రాజమౌళి – నటుడు మహేష్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిన్నటిదాకా అభిమానులు ఆ ఇద్దరి సినిమా గురించి ఆలోచించారు. ఒకవేళ రాజమౌళి , మహేష్ తో కలిసి సినిమా తీస్తే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు ఉంటారు. నటీ, నటులు ఎవరెవరు ఉంటారు. మాటల రచయిత ఎవరయితే బాగుంటది అని పలు విధాలుగా ఆలోచిస్తున్న అభిమానుల చర్చలకు నేటితో తెరపడింది. ఎట్టకేలకు అభిమానుల చర్చకు ప్రముఖ నిర్మాత కె ఎల్ నారాయణ తీపి కబురు చెప్పారు.

కె ఎల్ నారాయణ తీపి కబురు చెప్పడానికి ముందు కూడా అనేక విధాలుగా అభిమానుల్లో చర్చలు జరిగాయి.జక్కన్నతో అంతర్జాతీయ స్థాయిలో ఎవరెవరు రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. ముందస్తు అడ్వాన్స్ జక్కన్నకు ముట్టినవా. నటుడు మహేష్ తోనే జక్కన్న సినిమా తీస్తున్నారా అనే చర్చ కూడా సినీ పరిశ్రమలో జోరుగా చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలన్నిటికి ప్రముఖ అంతర్జాతీయ నిర్మాత ఒకే ఒక్క సమాధానం చెప్పేసారు

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ దుర్గ ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ తన మనసులోని మాటను చెప్పేసారు. గత 15 ఏళ్ల నుంచి జక్కన్న-మహేష్ బాబు లతో కలిసి సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా పెట్టుబడి కి తగ్గకుండా ఆ ఇద్దరితో సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక తీరింది. హలిఫుడ్ లో జక్కన్నకు అవకాశాలు పెద్ద ఎత్తున వచినప్పటికిని ఆ అవకాశాలను కాదని, నాతో సినిమా తీయడానికి ఒప్పుకోవడం సంతోషంగా ఉందని నారాయణ తన మనసులో 15 ఏళ్ల నుంచి ఉన్న మాటను బయట పెట్టారు.
————————–
ఎడిటర్ : పీఆర్ యాదవ్
9603505050
————————–

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *